Suryaa.co.in

Andhra Pradesh

బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు: సజ్జల

అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని, జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారని. పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరని ఎద్దేవా చేశారు. 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పని చేస్తున్నారని సజ్జల విమర్శించారు

LEAVE A RESPONSE