Suryaa.co.in

Andhra Pradesh

పదో తరగతి హాల్ టికెట్లను విడుదల చేసిన విద్యాశాఖ

-ఈ నెల 18 నుంచి 30 వరకు టెన్త్ ఎగ్జామ్స్
-ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు

ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని విద్యార్థులు ఎవరికి వారుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఎఎస్సెస్సీ వెబ్‌సైట్‌ (https://www.bse.ap.gov.in/apsscht24/HallTicketsSel.aspx) లోకి వెళ్లి విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

LEAVE A RESPONSE