Suryaa.co.in

Andhra Pradesh

అర్చకుల పై జరిగే దాడుల్ని అరికట్టాలి

– బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ

కాకినాడ శివాలయంలో పనిచేసే అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మల పై నేడు ఫాల్గుణ పౌర్ణమి నాడు గర్భగుడి వద్ద జరిగిన భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక అర్చకులను కాళ్ళతో ఎగిరి ఎగిరి తన్ని భౌతిక దాడి చేసిన వైసిపి మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసే వరకు ఉద్యమిస్తాం. నిందితుడికి మద్దత్తు ఇస్తున్న ఆలయ ఈఓ,కాకినాడ డిసి లపై చర్యలు తీసుకునే వరకు రాష్ట్ర అర్చక,పురోహిత,బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తాం.

LEAVE A RESPONSE