పల్నాడు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బిందు మాధవ్
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నూతన ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పనిచేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామని వెల్లడిరచారు. ఎవరైనా దాడులకు, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో బిందు మాధవ్ ఉమ్మడి గుంటూరు జిల్లా సెబ్ జాయింట్ డైరెక్టర్‌గా, తర్వాత నూతన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్‌గా విధులు నిర్వహించారు. అనంతరం ప్రమోషన్ పొంది గ్రేహౌండ్స్‌లో ఎస్పీగా పనిచేశారు.