-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
-వినుకొండ 21వ డివిజన్లో ఇంటింటా ప్రచారం
మేమంతా సిద్ధమంటూ మరోసారి అబద్ధాల యుద్ధానికి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రజల నుంచి తిరుగుబాట్లు, చీవాట్లు కనిపిస్తున్నాయా అని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు ప్రశ్నించారు. సాక్షాత్ ముఖ్యమంత్రికి ఈ దుస్థితి ఉంటే ఇక గల్లీల్లో తిరిగే ఎమ్మెల్యే బొల్లా లాంటి వారి పరిస్థితి తలుచుకుంటునే వైసీపీపై జాలేస్తోందని చురకలు అంటించారు. శుక్రవారం వినుకొండ 21వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి జగన్ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో వివరించారు.
అధికారం అనుభవించిన ఐదేళ్లు ప్రజలకు దూరంగా వారి కష్టాలు పట్టించుకోకుండా విర్రవీగిన పాపానికి ఇప్పుడు వారంతా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల గురించి అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతులు కల్పించలేని ప్రభుత్వం కావాలో… అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం కావాలో ఓటు ద్వారా పట్టణ ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు ఆంజనేయులుకు బ్రహ్మరథం పట్టారు. హారతులు ఇస్తూ తిలకాలు దిద్దుతూ స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.