-పశ్చిమ ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డు-బీమా సౌకర్యం
-ముఠా కార్మికులకు సుజనా చౌదరి హామీ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, వారి సంక్షేమం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఆదివారం తారపేట్ లో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలో ముఠా కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల వస్రలత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రచారంలో భాగంగా ఐరన్ యార్డ్ వస్రలత కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని గుర్తు చేశారు
పశ్చిమ నియోజకవర్గ ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. విద్య వైద్యం మౌలిక సదుపాయాలని మెరుగుపరిచి పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని కార్మికులకి హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తానని అందరూ అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం సేవలందించిన సుజనా చౌదరి లాంటి నేతను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతారన్నారు. సుజనా చౌదరికి అందరూ అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి కన్నా రజిని, బీజేపీ నాయకులు పైలా సోమి నాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు