Suryaa.co.in

Andhra Pradesh

త్వరలో నూతన ఐటి పాలసీ

ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష

అమరావతి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య అధికారులతో మంత్రి నారా లోకేష్ శనివారం సమావేశమయ్యారు.

రాష్ట్రంలో కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇప్పటికే ఉన్న ఐటి కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు తదితర వివరాలను ఆరా తీశారు. సాధ్యమైనంత త్వరగా వివరాలు సమర్పిస్తే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీ తీసుకువస్తామని లోకేష్ చెప్పారు.

విశాఖ ను ఐటి హబ్ గాను, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరుగాంచిన అన్ని పెద్ద కంపెనీలను రాష్ట్రం పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను కోరారు.

ఈ సమావేశంలో ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్, స్పెషల్ సెక్రటరీ బి.సుందర్, ఎపి టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరక్టర్ ఎం.రమణారెడ్డి, ఎపి ఇన్నొవేషన్ సొసైటీ సిఇఓ టి.అనిల్ కుమార్, ఆర్టిజీఎస్ డైరక్టర్ చెరుకువాడ శ్రీరామ్, కె.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE