-కోర్టు తీర్పు ఫైనల్
-కమిషన్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు
-విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్లా చెప్తారు?
-రమణ్ సింగ్ కు ఏమైనా లంచం ఇచ్చారా బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి
-కేసీఆర్ పై బురదజల్లే ప్రయత్నం
-మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి
విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం విచారణ కోసం కమిషన్ ను ఏర్పాటు చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చాము.
ఈఆర్సీ ముందు కాంగ్రెస్,బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారు. ఏ విచారణకు అయినా సిద్దమని మేము ఛాలెంజ్ చేశాము. కమీషన్ పాత్రపైన కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ చేసే అర్హత కమిషన్ చైర్మన్ కోల్పోయారని కేసీఆర్ లేఖ రాశారు.
కమిషన్ జ్యుడిషియరీ కమిషన్ కాదు. కమీషన్ చైర్మన్ ఎల్.నరసింహారెడ్డి పై సంపూర్ణ గౌరవం వుంది.తెలంగాణ వాదిగా నరసింహారెడ్డికి పేరు వుంది. కమిషన్ చైర్మన్ వున్న ఎల్.నరసింహారెడ్డి అభిప్రాయాలు మారాయి. ఇచ్చిన గడువు ప్రకారం మేము సమాధానం ఇద్దామని అనుకున్నాం.
కాంగ్రెస్,బీజేపీ నేతల అభిప్రాయాలను నరసింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్లా చెప్తారు? ఉమ్మడి రాష్ట్రంలో అనేక కమీషన్లు రద్దు అయ్యాయి.
ఎల్.నరసింహారెడ్డి న్యాయబద్ధంగా ఉంటారని భావించాము. ఈఆర్సీ స్వతంత్ర కమీషన్ అది ఇచ్చిన తీర్పు ఫైనల్. కోర్టు తీర్పు ఫైనల్ కానీ కమిషన్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు. ఈఆర్సీ తీర్పు ఇచ్చాక కమీషన్ ఎట్లా వేస్తారని నరసింహారెడ్డికి తెలియదా?
15 వ తేదీ వరకు సమయం ఇచ్చి 11 వ తేదీన నరసింహారెడ్డి మీడియా సమావేశం ఎట్లా ఏర్పాటు చేశారు? తెలంగాణ సమాజానికి నిజాలు చెప్పడానికి కేసీఆర్ లేఖలు రాశారు. కమిషన్ బాధ్యతల నుండి నరసింహారెడ్డి తప్పుకుంటారని భావిస్తున్నాం. విచారణ కమీషన్ అసంబద్ధమైనది. ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ ఒప్పందం,భద్రాద్రి,యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతోనే ఒప్పందం చేసుకున్నాము.
చత్తీడ్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వంతో బహిరంగంగా విద్యుత్ ఒప్పందం చేసుకున్నాము. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ మాజీ సీఎం రమణ్ సింగ్ కు ఏమైనా లంచం ఇచ్చారా బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. కమిషన్ ఏర్పాటు కుట్రపూరితంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకున్నాము.
ఏమైనా అవినీతి జరిగితే కేంద్రం నిజానిజాలు బయటపెట్టాలి. కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నారు. తెలంగాణ మాత్రం 3.90 పైసలకు విద్యుత్ తీసుకున్నాము. కేసీఆర్ వివరణ తీసుకున్నాక ఛత్తీస్ ఘడ్ వాళ్లను పిలిస్తే బాగుండేది. దేశంలో ఏ కమిషన్ మధ్యలో లీకులు ఇవ్వలేదు.
800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశాము. ఈ రోజుకు రామగుండం,భూపాలపల్లి, కొత్తగూడెం, విజయవాడ, ఆర్టీపీసీ నుండి సబ్ క్రిటికల్టెక్నాలజీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ బి.హెచ్.ఈ.ఎల్ కు
భద్రాద్రి,యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలను అప్పగించాము. కేసీఆర్ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.