లోక్ సభ సభ్యురాలిగా తెలుగు నటి రచనా బెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు. పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నియోజకవర్గం నుంచి ఆమె తృణమూల్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారు. రాజకీయ అరంగేట్రంతోనే ఆమె విజయం సాధించారు. కాగా, తెలుగులో పలు హిట్ సినిమాల్లో రచన నటించి అందరికీ సుపరిచితురాలు అయ్యారు.