Suryaa.co.in

Andhra Pradesh

చిన్నారికి “చరణి”గా నామకరణం చేసిన చంద్రబాబు

కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం లో రెండవ రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆర్&బి అతిథి గృహంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ముఖ్యమంత్రి ని కలిశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శాంతిపురం మండలం నకు చెందిన సుధాకర్, ప్రియ దంపతుల రెండవ కుమార్తె చిన్నారి కి నామకరణం చేయవలసిందిగా కోరగా…చంద్రబాబు నాయుడు, ముద్దులొలికే చిన్నారిని తీసుకొని “చరణి” గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE