Suryaa.co.in

National

కాంగ్రెస్‌లో చేరిన కేకే

ఢిల్లీ: సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గతంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE