– నా భార్య బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి
– కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది కాదు
– ఎంపి విజయసాయిరెడ్డి, లాయర్ సుభాష్‌పై చర్య తీసుకోండి
– కమిషనర్‌కు దేవదాయశాఖ ఏసీ శాంతి భర్త ఫిర్యాదు
– సోషల్‌మీడియాలో విజయసాయి, శాంతి ఫొటోలు హల్‌చల్
– శాంతి వెనుక చార్టెడ్ ఫ్లైట్ ఎక్కడిది?
– తెరపైకి విజయసాయి విశాఖ లీలల ట్రోలింగ్
– విజయసాయిపై ఆరోపణలతో వైసీపీలో కుదుపు
– ఆరోపణపై పెదవి విప్పని విజయసాయి
– దానిపై స్పందించని అంబటి, అనిల్‌కుమార్
– విజయసాయిని రక్షించని సజ్జల, అవంతి మౌనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీకి కాలం ఖర్మం కలసిరావడం లేదు. తాడే పామై కరుస్తోంది. రాసలీలల వ్యవహారంతో ఇప్పటికే గబ్బుపట్టిన వైసీపీకి.. తాజాగా మరో అ‘శాంతి’ తలనొప్పి తగులుతుంది. ఆ పార్టీ నెంబర్‌టూ, రాజ్యసభ ఎంపి వేణుంబాక విజయసాయిరెడ్డి రాసలీలను ఒక బాధిత ‘భర్త’ సిగ్గువిడిచి.. ఏకంగా దేవదాయ శాఖ కమిషనర్‌కే ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డను తాను తండ్రిని కాదని, దానికి ఎంపి విజయసాయిరెడ్డి, లాయర్ సుభాష్ బాధ్యులంటూ దేవదాయశాఖ ఏసీగా ఇటీవలే సస్పెండయిన శాంతి భర్త.. కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తాను అమెరికాలో ఉంటే తన భార్యకు గర్భం ఎలా వస్తుందన్నది సదరు అమెరికా భర్త లా పాయింట్.
ఇది అచ్చం అప్పట్లో శోభన్‌బాబు, జగపతిబాబు సినిమా స్టోరీనే. కాకపోతే కాస్తంత స్క్రీన్‌ప్లే మార్పు. పాత్రలు కొన్ని రివర్సు. ఆ బిడ్డకు తండ్రెవరన్నది ఆ సినిమాల సారాంశం. ఇప్పుడు సేమ్ టు సేమ్.. విజయవాడలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసి, ఇటీవలే సస్పెండయిన శాంతి కథ. ఇంకా అమెరికాలో ఉన్న ఆమె భర్త మాటల ప్రకారమైతే ఇదొక కుటుంబ అ‘శాంతి’ కథ!
శాంతి భర్త మదన్ మోహన్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. సరే.. ఉద్యోగాలు చేసే భార్య- భర్తల మధ్య.. అదీ విదేశాల్లో ఒకరు-స్వదేశంలో మరొకరుంటే ఆ ఎడబాటు సంగతి చెప్పనక్కర్లేదు. ఇక్కడ సమస్య అది కాదు. అసలు విదేశాల్లో తన మానాన తాను ఉద్యోగం చేసుకుంటుంటే. విజయవాడలో ఉన్న తన భార్యకు గర్భం ఎలా వస్తుందన్నది ఆ మొగుడిగారి ప్రశ్న. అందుకే ఆయన సిగ్గువిడిచి, తనకు తెలిసిన నిజాలను భార్య బాసు అయిన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ‘‘అసలు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ బిడ్డకు నేను తండ్రిని కాదు. అందుకు ఎంపి విజయసాయిరెడ్డి, లాయర్ సుభాష్‌లే కారణం. కాబట్టి ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరన్నదీ తేల్చి నాకు న్యాయం చేయండి’’-ఇదీ విదేశాల్లో ఉన్న భర్తగారు పెట్టుకున్న ‘అర్జీ.
ఇప్పుడు కమిషనర్ గారు ఏం చేయాలన్నది మిలియన్ డాలర్ల సందేహం. పోనీ వాళ్లిద్దరినీ టెస్టులకు పంపించి, నిజం కక్కిస్తారా అంటే.. ఆ అధికారం కమిషనర్ కు లేవాయె. కోర్టు ఆదేశిస్తే గానీ అలాంటివి జరగవు. అలాగని ఆ బిడ్డకు తామే తండ్రులమని, భర్త ఫిర్యాదు చేసిన వారు ఎందుకు అంగీకరిస్తారు? వారికీ సంసారులూ గట్రా ఉన్నాయి కదా? విదేశాల్లో ఉన్న భర్త పిచ్చి కాకపోతే!
సరే.. శాంతి వ్యవహారం శనివారం ఉదయం నుంచి వైసీపీలో అ‘శాంతి’ రేపుతుంటే.. రాత్రి వరకూ పార్టీ నాయకత్వంలో ఉలుకు పలుకూ లేకపోవడమే విడ్డూరం. ఆమాటకొస్తే అసలు శనివారం ప్రెస్‌మీట్లు పెట్టలేదా? అంటే అంబటి రాంబాబు, అనిల్‌కుమార్ ప్రెస్‌మీట్లు పెట్టి సర్కారుపై ధ్వజమెత్తారు. అప్పుడు కూడా వారిద్దరూ ఈ అ ‘శాంతి’కి సంబంధించి, విజయసాయిరెడ్డిపై చేసిన ఆరోపణలు ప్రస్తావించకపోవడమే విడ్డూరం. అటు మాజీ ఎంపి వంగా గీత వేరే అంశంపై ట్వీటారే తప్ప.. ఈ అ‘శాంతి’ గురించి పల్లెత్తుమాటంటే ఒట్టు.
అలాగని ‘బాధిత భర్త’ చేసిన ఆరోపణలను ఎంపి విజయసాయిరెడ్డి ఏమైనా మీడియా ముందుకొచ్చి.. ‘‘అసలు నాకు ఆ శాంతి ఎవరో తెలియదు. ఆమె ముఖం కూడా నేనెప్పుడూ చూడలేదు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. నేను శ్రీరాముడి కజిన్ బ్రదర్ ను. కావాలంటే విశాఖవాసులను, విశాఖలో మా పార్టీ మహిళా లీడర్లు, మహిళా కార్పొరేటర్లను అడిగిచూడండి. విశాఖ గెస్టు హౌస్‌లో మా గోడలు, తలుపులను అడిగినా చెబుతాయి. అక్కడ అసలు ఆడవారికి ప్రవేశమే లేదు. నాకు ఆడవాసనంటేనే గిట్టదు. నాకు అసలు ఆడవారివైపు కన్నెత్తి చూడాలంటేనే మహా సిగ్గు బాబూ.. కావాలంటే జగనన్ననే అడగండి’’ అని ఖండించారా అంటే అదీలేదు. ఆయన కూడా తనను కాదన్నట్లు, బే ఫికర్‌గా ఉండటం మరో వింత.
సరే.. తన పార్టీ సీనియర్ నాయకుడిని బయటపడేసి, ‘కడుపు’లో దాచుకునేందుకు ఢక్కాముక్కీలు తిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గానీ.. అంబటి రాంబాబు గానీ.. అవంతి శ్రీనివాస్‌గానీ ప్రత్యక్షమవుతారనుకుంటే, వాళ్లూ భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. ‘‘హేమిటో.. అసలే ప్రాణం లేని జీవిగా ఉన్న మా పార్టీకి, ఇలాంటి గంట-అరగంట నాయకులు, చిలకలూరిపేట సయ్యాట నేతలతో చావుకొచ్చింది. ఈ ‘శాంతి’ ఎపిసోడ్‌లో విజయసాయిరెడ్డిపై సోషల్‌మీడియాలో అవుతున్న ట్రోలింగ్, ఆ ఫొటోలు చూడలేక మా పరువుపోతోంది. ఇవన్నీ మా జగన్‌గారికి పట్టవాయె. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు’’ అని ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు.
వారి ఆందోళనకు తగినట్లుగానే.. విజయసాయి-శాంతి ఉన్న వేర్వేరు ఫొటోలు, చార్టెడ్‌ఫ్లైట్ ముందున్న శాంతి స్టైలిష్ ఫొటోలు, సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఒక సాధారణ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్‌కు చార్టెడ్‌ఫ్లైట్‌లో వెళ్లేంత డబ్బుంటుందా? అన్నది నెటిజన్ల డౌటనుమానం. మరికొందరు ‘విశాఖలో విజయసాయి లీల’ల పేరిట తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్లి ‘ ఢిల్లీలో పాపం ఆ మహిళా అధికారి కోసం కష్టపడి తీసుకువచ్చిన విజయానందం చూడతరమా?’ అంటూ మరో ట్రోలింగు. చూడాలి.. ‘ఆ బిడ్డకు నేను తండ్రి కాదు’ ఎపిసోడ్ ఎక్కడిదాకా వెళుతుందో?! మొత్తానికి ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. వైసీపీలో ఇదో అ‘శాంతి’!