Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి .. నీ దుర్మార్గాలే ఆ బుక్ లో ఉన్నాయి

మద్యం కుంభకోణంలో అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి
సిబిసిఐడి విచారణతో పాటు ఈడీ విచారణ
మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు

గొల్లపూడి: శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా పారిపోయి జగన్ ఢిల్లీలో ధర్నా డ్రామా తో అభాసుపాలయ్యారు. రెడ్ బుక్ అని జగన్ రెడ్డి కలవరిస్తున్నాడు. నువ్వు చేసిన దుర్మార్గాలే ఆ బుక్ లో ఉన్నాయి. అసెంబ్లీలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేత పత్రం విడుదల చేస్తుంటే, తాడేపల్లి ప్యాలెస్ ఉన్న జగన్ రెడ్డి చర్చలో ఎందుకు పాల్గొనలేదు?

వినుకొండలో ఇద్దరి వ్యక్తిగత గొడవ ను రాజకీయ రంగు పులిమి వారిని పరామర్శించడానికి పోయి, పథకాల గురించి మాట్లాడావంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. తప్పుడు ప్రచారాలతో బురదజల్లే కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో ధర్నా చేసి 36 మంది పేర్లు అడిగితే సమాధానం చెప్పలేకపోయావు?

నీ అరాచక పాలనలో తెదేపా, కూటమి కార్యకర్తలు నాయకులపై 3వేలకు పైగా కేసులు పెడితే చంద్రబాబు వివరాలతో సహా కళ్లకు కట్టినట్లు చూపించారు. అవినీతిపరుడు, నేరస్తుడు అయిన వ్యక్తిని శాసనమండలిలో నాయకుడిగా ఎన్నుకోవడం నేర ప్రవృత్తిని బయటపెడుతుంది. అవినీతి అరాచక పాలనకు 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నీలో మార్పులేదు, ఆత్మ పరిశీలన లేదు, పశ్చాత్తాపం రాలేదు.ఉన్న కొద్ది నాయకులు కూడా దుకాణం సర్దేసుకుంటున్నారు వైసీపీ పార్టీ భూస్థాపితం అవ్వడానికి ఎంతో కాలం పట్టదు.

ఇప్పటికైనా సభకు వచ్చి సభలో మాట్లాడే ధైర్యం నీకు ఉందా? అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తుంటే మాట్లాడే పరిస్థితి లేదు. అమరావతి ప్రజా రాజధానికి 15 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రకటన వస్తే వైసీపీ పార్టీ నుంచి ఒక్క మంచి మాట రాలేదు.

34 వేల ఎకరాలు భూములు ఇచ్చి త్యాగాలు చేసిన రైతులు ఎన్నో వందల కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లి నాలుగు సంవత్సరాలు పైగా పోరాటం చేశారు. అమరావతి ప్రజా రాజధాని లో బడ్జెట్ కేటాయింపులు వచ్చి పనులు జరగబోతుంటే జగన్ రెడ్డి నోట వెంట ఒక్క మాట రాలేదు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11,527 కోట్ల పనులు చేయించాం. గతంలో ఇచ్చిన డబ్బులు రిహాబిటేషన్, ల్యాండ్ ఎక్విజేషన్, ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది.జాతీయ ప్రాజెక్టు పోలవరం నిధుల బాధ్యత మాదే పూర్తిస్థాయిలో నిధులు ఇస్తాం గతంలో ఇచ్చాం.

గత ఐదేళ్లుగా ప్రాజెక్టు పై విషం చిమ్మారు. మాకు తెలియదు.. అర్థం కావడం లేదు అని పిచ్చి మాటలు మాట్లాడారు.

చంద్రబాబు కృషితో జాతీయ ప్రాజెక్టు పూర్తి బాధ్యత మాదే పూర్తిగా నిధులు ఇచ్చి పూర్తి చేస్తాం అని కేంద్రం చెప్పింది. ఎందుకు 11 సీట్లకు పరిమితం అయ్యామో ఆలోచన చేయకుండా, నేర ప్రవృత్తితో వ్యవహరిస్తున్నాడు. హూ కిల్డ్ బాబాయ్ అని ఆనాడు ఢిల్లీలో అడిగి వస్తే విషయాలు బయటకు వచ్చేవి.

ఐదేళ్లపాటు భారీ ఎత్తున చేసిన మద్యం కుంభకోణంలో అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. లెక్కలు లేకుండా నగదు రూపంలో లక్ష కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపారు వేల కోట్లు దోచుకున్నారు. సిబిసిఐడి విచారణతో పాటు ఈడీ విచారణ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కటి బయటికి వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది

జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లావు? అమరావతి ప్రాజెక్టు లైఫ్ లైన్ కు డబ్బులు తెచ్చావా? ఔటర్ రింగ్ రోడ్డుకు డబ్బులు అడిగావా? ఇండస్ట్రియల్ ప్రాజెక్టులకు డబ్బులు అడిగారా ? బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలను కాపాడమని.. సిబిఐ, ఈడి కేసుల్లో బయటపడేయమని నీ సమయం అంతా ఐదేళ్లు సరిపోయింది.రాష్ట్ర ప్రయోజనాల కోసం రైల్వే జోన్ కోసం విశాఖ ఉక్కు కాపాడడం కోసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం దేనికోసం కూడా జగన్ రెడ్డి ప్రయత్నం చేయలేదు.

ఇవాళ చంద్రబాబు నాయుడు రెండే రెండు సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పేరు ఎన్నిసార్లు ఎన్నిసార్లు మాట్లాడారు ఒకసారి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని అడుగుతున్నా. మీ నాయకులు చేసిన హత్యలు, దుర్మార్గాలు చూడడానికి చంద్రబాబు నాయుడు పల్నాడు యాత్ర పెట్టుకుంటే ఇంటి గేటుకు తాళ్లు కట్టించావు. మొన్న నువ్వు పర్యటనకు వెళ్లి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలేసి కాన్వాయలో అది వచ్చినప్పటికీ, వాహనం లేదని అసత్యాలు మాట్లాడావు.

నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం దోపిడీ ఇదంతా కూడా బట్టబయలు అవ్వాలి. విచారణలో ఆ సొమ్ము అంత రాష్ట్ర ఖజానాకు రావాలి దోచుకున్న సొమ్మంతా కక్కించాలి. ఎవరైతే తప్పు చేశారో దుర్మార్గాలు చేశారో వాటన్నీటిపై కూడా చట్టపరంగా గట్టిగా చర్యలు తీసుకుంటాం అని చంద్రబాబు నాయుడు శాసనసభలో చెప్పారు.

మీరు చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకుంటారు. తప్పు చేసిన వైసిపి నాయకులకు చట్టబద్ధంగా శిక్ష పడాల్సిందే. దోచుకున్న డబ్బు అంతా రాష్ట్ర ఖజానాకు రావాల్సిందే.

 

LEAVE A RESPONSE