Suryaa.co.in

Andhra Pradesh

పెద్దిరెడ్డి ఈ సవాల్ కాసుకో..

-మిథున్ రెడ్డి ఓ శుద్ధపూస
– ఓటమితో వైసీపీకి బుద్ధి రాలేదు
– పెద్దిరెడ్డి దోపిడీలు భూములు, గనులు, ఇసుక, విద్యుత్తు అన్నింటా…
-బీసీ యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్

తిరుపతి: గత అయిదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూములను తమ సొంత ఆస్తులలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు పంచుకుని తిన్నారని బీసీ యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆరోపించారు.

శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి, అతని మనుషులు కేవలం భూములను మాత్రమే కాకుండా గనులు, ఇసుక, విద్యుత్తు అన్నింటా దోచుకున్నారని అధినేత మండిపడ్డారు.. పెద్దిరెడ్డి కంపెనీ పీఎల్ఆర్ కి లబ్ధి చేకూర్చడానికి అక్రమ ప్రాజెక్టులు కట్టబెట్టారని.. రైతుల భూములు దోచుకున్నారని ఆరోపించారు.. రాష్ట్రంలోని సామాన్య ప్రజల నుండి ప్రతీ ఒక్కరూ గత అయిదేళ్ల దోపిడీ, అరాచకాలపై ఆశ్చర్యపోతున్నారనీ పేర్కొన్నారు.

రాష్ట్రంలోను, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోను జరిగిన అక్రమాలు కల్లెదురుగా కనిపిస్తున్నా.. ఎంపీ మిథున్ రెడ్డి నిన్న డిల్లీలో మాట్లాడుతూ “మేము అమాయకులం, మేము ఉద్ధారకులం, మేము సచ్చీలులం, అన్యాయం చేయలేదు, మాకు దోపిడీ, దౌర్జన్యం రాదు” అని నిస్సిగ్గుగా మాట్లాడారని రామచంద్ర యాదవ్ దుయ్యబట్టారు.. మిథున్ రెడ్డి ప్రస్తావించిన అఫిడవిట్ అంశంపై కాకుండా మీరు ప్రకటించని, చూపని ఆస్తుల గురించి మాట్లాడాలని సవాల్ చేశారు.

“మీరు దోపిడీ చేసిన, దౌర్జన్యంగా లాక్కున్న ఆస్తుల గురించి, మీ తండ్రి గారి ఎన్నికల అఫిడవిట్ లో చూపించని ఆస్తులు 142 నేను సేకరించి కోర్టుకి ఇచ్చాను. మీ దోపిడీలో ఇవి కేవలం 1% మాత్రమే.. మీరు పొందుపరచనీ ఆస్తుల వివరాలపై విచారణ జరుగుతుందని చెప్పారు. కోర్టులో విచారణ సందర్భంగా అధికారులకు, కొందరికి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు ”

ఈ 142 ఆస్తుల్లో ఏ ఒక్కటీ మాది కాదు అని మీరు నిరూపించినా తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని, ఈ సవాల్ స్వీకరించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా మిథున్ రెడ్డిలో ఎవరైనా ఈ 142 ఆస్తుల గురించి మాట్లాడాలని, నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

పోరాటం ఆగదు..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యులు, అనుచరుల ఆగడాలు, అక్రమాలను బయటపెట్టి తీరుతానని.. పుంగనూరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెద్దిరెడ్డి అరాచకాలకు శాశ్వత విముక్తి కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంలో “రాష్ట్రంలో ఒక మంత్రి ఆయన స్థాయిలో ఇంతగా అవినీతి చేస్తే.. విదేశాల్లో షాపింగ్ కాంప్లెక్స్ లు, బొగ్గు గనుల వ్యాపారాలు చేసే స్థాయికి ఎదిగారంటే.. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అవినీతి చేశారో.. ఈ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిగ్గు తేల్చాలని డిమండ్ చేశారు.

ఇంత అరాచకాలు, దోపిడీ చేసిన తర్వాత కూడా జగన్ సిగ్గు లేకుండా.. ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకి వెళ్ళడం అవివేకం అనీ.. ఒకవేళ పులివెందుల ప్రజలు ఓడిస్తే.. దానిపై కూడా కోర్టుకి వెళ్లేలా జగన్ నవ్వులపాలయ్యారని దుయ్యబట్టారు.. వేయి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టు.. లక్షల కోట్లు దోచుకుని, ఎన్నో అరాచకాలు చేసిన జగన్ డిల్లి వెళ్లి ధర్నాలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు.

LEAVE A RESPONSE