Suryaa.co.in

Telangana

కేంద్ర నిధులతో రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు

-పార్లమెంట్ లో ఫైనాన్స్ బిల్ పై ఎంపీ రఘునందన్ రావు ప్రసంగం

ఢిల్లీ: పార్లమెంట్ లో ఫైనాన్స్ బిల్ పై ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి దిశలో మోడీ సర్కారు తీసుకుంటున్న చర్యలు, పారదర్శకత మరియు GST అమలు వల్ల ప్రజలకు కలిగిన లాభాలను వివరించారు. తెలంగాణ సర్కారు పై తీవ్ర విమర్శలు చేస్తూ, కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా ఉపయోగించలేదని, తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు.

ఇన్కమ్ టాక్స్ విభాగం మరియు ఇతర విభాగాలలో నరేంద్ర మోడీ నేతృత్వంలో సర్కారు పారదర్శకత తీసుకువచ్చిందని రఘునందన్ రావు చెప్పారు. “సర్కారు ను గౌరవించే వారి సంఖ్య పెరిగింది, టాక్స్ కట్టే వారి సంఖ్య కూడా గణనీయంగా పెంచగలిగింది మోడీ సర్కారు! దేశ ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వం మీద నమ్మకం పెంచుకున్నారు,” అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పాత సర్కారు, కొత్త కాంగ్రెస్ సర్కారు రెండు కూడా మంచి జరిగితే తమదిగా, ఏదన్నా పని జరగకపోతే కేంద్రం మీద నెట్టడం పరిపాటిగా మారిందని రఘునందన్ రావు ఆరోపించారు. “తెలంగాణ సర్కారు లెక్కా పత్రాలు లేకుండా లక్షల కోట్లు ( 288811000000) ఖర్చు పెట్టిందని CAG రిపోర్ట్ చెప్పింది. కేంద్రం డివేల్స్యూషన్ నేరుగా 42 శాతం నిధులు రాష్ట్రానికి నిధులు ఇస్తున్నా చెప్పడం లేదు! కేంద్రం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరు మీద నిధులు ఇచ్చినా కూడా కెసిఆర్ డబల్ బెడ్ రూం అని తానే డబ్బులు ఇస్తున్నట్టు, రేవంత్ సర్కారు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మభ్య పెడుతున్నారు,” అని వివరించారు.

GST కాంగ్రెస్ సోనియా గాంధీ మానస పుత్రిక అని చెప్పి అమలు చెయ్యలేక పోయారు కాంగ్రెస్ వాళ్ళు. 2017 లో మోడీ నేతృత్వం లో GST అమలు చెయ్యడం వల్ల ఇవ్వాళ రెండు లక్షల కోట్లకు పైగా వసూలు చేయగలుగుతున్నారు,” అని అన్నారు.

తెలంగాణ సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. “తెలంగాణ కు డైరెక్ట్ ఫండ్ కింద 48,000 కోట్లు వచ్చినా తెలంగాణ సర్కారు తప్పుడు లెక్కలు చెప్తోంది,” అని పేర్కొన్నారు.

“నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ అర్థం కావాలంటే నిరుపేదల ఆకాంక్షల ద్వారా చూస్తేనే అర్థమవుతుంది. బడ్జెట్ ను అర్థం చేసుకునే స్థాయి తెలంగాణ సీఎంతో పాటు, కాంగ్రెస్ నాయకులకు లేదు,” అని రఘునందన్ రావు అన్నారు.

LEAVE A RESPONSE