Suryaa.co.in

National

కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు కోర్టు నోటీసులు

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు బెంగళూరు కోర్టు షాకిచ్చింది. 2022 నాటి నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వేధిస్తున్నారంటూ ‘ఈడీ’కి వ్యతిరేకంగా చేసిన నిరసనలో సిద్దరామయ్య, డీకే శివకుమార్  పాల్గొన్నారు. ఈ కేసు విచారణ క్రమంలో ఆగస్టు 29న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఇరునేతలకు బెంగళూరు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

LEAVE A RESPONSE