Suryaa.co.in

Andhra Pradesh

పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

అమరావతి : ఈవీఎం నేలకేసి కొట్టిన కేసులో నిందితుడైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని, హైకోర్టుకు పోలీసుల తరపు న్యాయవాది అశ్వనీకుమార్ సూచించారు. రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారించాలని పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. అనంతరం కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.

LEAVE A RESPONSE