– రూ. 15లకే పేదలకి మూడు పూటలా నాణ్యమైన భోజనం
– రాష్ట్రంలో మొత్తం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం
– గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసేసి నిరుపేదల కడుపుకొట్టింది
– ఎంతో మంది దాతలు ముందుకొస్తున్నారు
– ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం
– రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
– నెల్లూరు చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి, అజీజ్, శ్రీనివాసులురెడ్డి
– నిరుపేదలకు స్వయంగా టిఫిన్లు వడ్డించిన మంత్రి
– అందరితో కలిసి అల్పాహారం చేసిన నారాయణ, అజీజ్, శ్రీనివాసులురెడ్డి
నిరుపేదలకి రూ. 15లకే మూడు పూటలా కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు…రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను నిరంతరం కొనసాగిస్తామని…రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరం చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను శుక్రవారం… నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలతో కలిసి ఆయన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ముందుగా మంత్రి నారాయణకి స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. నిరుపేదలకి స్వయంగా మంత్రి నారాయణే టిఫిన్ వడ్డించి…ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. నారాయణ సార్ చాలా బాగుంది సార్…అని చెప్పడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ నేతలు, నిరుపేదలతో కలిసి ఆయన కూడా అల్పాహార విందు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం సీఎం నారా చంద్రబాబునాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారన్నారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకే రాష్ట్రంలో 99 క్యాంటీన్లు, మంత్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించాలని ఆదేశించాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు…ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. 2014 -19 టీడీపీ ప్రభుత్వంలో 203 క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
183 క్యాంటీన్లు అప్పుడే ప్రారంభించామని గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసి నిరుపేదల కడుపుకొట్టిందని మండిపడ్డారు. కేవలం రూ. 5లకే ప్రతీ పేదవాడు చక్కగా నాణ్యమైన ఆహారాన్ని తింటున్నాడన్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి అన్న క్యాంటీన్లు లేవన్నారు. రోజుకి రెండు లక్షల 25 వేల మంది అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారన్నారు. అలాంటి క్యాంటీన్లను మూసేయడం దారుణమన్నారు.
అలాగే పేదలకు అవసరమైన ప్రదేశాలలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా మటన్, చేపలు, కూరగాయల మార్కెట్లకు అధికంగా నిరుపేదలు ఉదయమే వచ్చేస్తారన్న ఉద్దేశంతో…వారందరూ రూ. 5లకే కడుపు నిండా భోజనం తినాలనే టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీసుకువచ్చిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల్లో వాగ్దానం చేశారని…ఆ వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారన్నారు. వంద రోజుల్లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారని… అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 100 క్యాంటీన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిగిలినవి సెప్టెంబర్ నెల ఆఖరిలోగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అదే విధంగా రూరల్ నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిన్ననే సీఎం చెప్పారన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం కొందరు దాతలు ముందుకు వస్తున్నారన్నారు. అందులో శ్రీనివాసరావు అనే దాత…రూ. కోటి రూపాయలు ఇచ్చారన్నారు. అలాగే ముఖ్యమంత్రి సతీమణి కూడా కోటి రూపాయలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నిన్న గుడివాడలో అన్న క్యాంటీన్ దగ్గర మరో రూ. 58 లక్షలు విరాళాలను దాతలు అందచేశారన్నారు. ఈ విధంగా కార్ఫస్ ఫండ్ డెవలప్ చేసి…అన్న క్యాంటీన్లను పర్మినెంట్‌గా ఉంచాలని సీఎం చెప్పారన్నారు.
2014 నుంచి 2019 వరకు ఏదైతే మెనూ ఉందో…ఇప్పుడు కూడా అదే మెనూను కంటీన్యూ చేస్తున్నామన్నారు. అదే ధరలు…ఏం పెంచడం లేదన్నారు. స్వచ్ఛంధ సంస్థ అయిన అక్షయపాత్ర వాళ్లకి ఇవ్వడం జరిగిందన్నారు. ఒక్కో వ్యక్తికి రోజుకు 90 రూపాయలు ఖర్చు చేస్తున్నామని…కానీ తమ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన రుచికరమైన ఆహారం 15 రూపాయలకే మూడు పూటలా అందిస్తున్నామన్నారు. మిగతా రూ. 75లు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జియం విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు