Suryaa.co.in

Andhra Pradesh

శభాష్‌ లోకేష్‌!

– యువత నైపుణ్య వృద్ధిలో ఏపీని నెంబర్‌ 1గా చేసేందుకు తొలి అడుగు
– నారాను ప్రశంసించిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్

విజయవాడ: ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ దేశంలోనే మొదటి రాష్ట్రంగా నైపుణ్య గణన(స్కిల్ సెన్సస్)ని అర్థవంతంగా చేపట్టి చరిత్ర సృష్టిస్తున్నారు.. ఇది రాష్ట్రంలోని అన్ని వయసుల వారికి, ప్రముఖంగా యువకులు, విద్యార్థులకు నైపుణ్య వృద్ధితో సానుకూల ఫలితాలను ఇవ్వడానికి అవకాశం కలుగుతుందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అభినందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నైపుణ్య వృద్ధితో యువత సరైన అవకాశాలు పొందడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ కార్యక్రమం దేశ ప్రయోజనాల కోసం అన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

నేడు నైపుణ్యంతో కూడిన మంచి విద్య యువతకు వారి ఉద్యోగం లేదా వ్యాపార వ్యవహారాలలో అత్యధిక ప్రయోజనాలను అందిస్తుందని, నైపుణ్య వృద్ధి లేకుంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉన్నా సరైన అవకాశాలు పొందలేకపోతున్నారిన తెలిపారు. ఇంకా, కేంద్ర ప్రభుత్వం 2024 – 25 బడ్జెట్‌ లో 2 లక్షల కోట్లు నైపుణ్యాభివృద్ధికి కేటాయింపులు చేసి, రాబోయే అయిదేళ్ళలో దేశంలోని 4.10 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్య అవకాశాలను కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా దినకర్‌ పేర్కొన్నారు. యువత నైపుణ్య వృద్ధిలో ఏపీని మొదటి స్థానంలో నిలపడానికి మంత్రి నారా తొలి అడుగు వేశారని ప్రశంసించారు.

LEAVE A RESPONSE