విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు. తెలుగు వాడుక భాషలో రచనలు ఉండాలని జీవితాంతం ఉద్యమించిన వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం, ఆ మహనీయుని కృషిని స్మరించుకునే అవకాశం తెలుగువారిగా మనకు దక్కింది.
అమ్మ జన్మనిస్తే, మాతృభాష తెలుగు మన జీవితాలకు వెలుగునిస్తోంది. ఇంగ్లీషు మీడియం, విదేశాల్లో చదువు వల్ల నేను మొదట్లో తెలుగులో మాట్లాడేటప్పుడు పదాలు అటు ఇటు అయితే.. ఎంతో బాధపడేవాడిని. అచ్చమైన తెలుగులో నిత్యం జనంతో మాట్లాడుతూ ఉంటే మాతృభాష మాధుర్యం ఎంత గొప్పదో తెలుస్తోంది. మా అబ్బాయి దేవాన్ష్‌కి ప్రత్యేకంగా తెలుగు మాట్లాడటమే కాదు.. చదవటం, రాయటం కూడా నేర్పిస్తున్నాను. తెలుగువారిగా గర్వపడదాం.. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేద్దాం. తెలుగు భాషని సుసంపన్నం చేస్తున్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.