Suryaa.co.in

Telangana

కేన్స్ గుజరాత్‌కు తరిలిపోతున్నమాట నిజమేనా?

– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కేన్స్ సంస్థ తెలంగాణ లో పెడతామన్న తన యూనిట్ ను గుజరాత్ కు తరలిచేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. అది వింటుంటే చాలా బాధనిపిస్తోంది. ఈ సంస్థను కర్ణాటక నుంచి తెలంగాణకు రప్పించేందుకు ఎంతో కష్టపడ్డాం.

హైదరాబాద్ లో తమ యూనిట్ పెట్టాలంటే కొంగర కలాన్ లోని ఫాక్స్ కాన్ ఫ్లాంట్ పక్కన భూమి కేటాయించాలని వారు కోరారు. పది రోజుల్లోనే వారికి భూమి కేటాయించి తెలంగాణలో యూనిట్ పెట్టేందుకు ఒప్పించాం. దీంతో వాళ్లు గతేడాది అక్టోబర్ లో తమ యూనిట్ ను మన రాష్ట్రంలో పెడతామని ప్రకటించారు.

కానీ ఇప్పుడు ఆ సంస్థ గుజరాత్ కు తమ యూనిట్ ను తరలిస్తుందన్న వార్తలు చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. ఎంతో కష్టపడి కేన్స్ సంస్థ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పిస్తే ఇప్పుడు ఆ సంస్థను తరలిపోకుండా కాపాడలేకపోతున్నారు.

సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో దాదాపు రూ. 3500 కోట్ల తో కేన్స్ మన వద్ద పెట్టుబడులు పెడతామని చెప్పింది. ఆ యూనిట్ ప్రారంభమై ఉంటే మన యువతకు ఉపాధితో పాటు రాష్ట్రానికి ఆదాయం పెరిగేది. ఇది తెలంగాణకు చాలా నష్టం.

LEAVE A RESPONSE