Suryaa.co.in

Telangana

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భట్టి

హైదరాబాద్: రవీంద్రభారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురుపూజోత్సవ కార్యక్రమంలో గురువుల గురించి మాట్లాడుతున్న క్రమంలో నిజాం కాలేజీలో తనకు ప్రొఫెసర్ కోదండరాం విద్యా బోధన చేశారని చెప్పారు. కోదండరాం జన్మ దినోత్సవ సందర్భంగా పుష్పగుచ్చం అందించి పట్టు శాలువ కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE