Suryaa.co.in

Andhra Pradesh

ప్రణాళికలు అమలు…ఆందోళన వద్దు

వరద బాధితులకు మంత్రి సవిత భరోసా

అమరావతి : వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత భరోస ఇచ్చారు. సోమవారం విజయవాడ నగరం 54, 55, 56 డివిజన్లలో పర్యటించారు.

ముందుగా 54 డివిజన్ లో ని పంజా సెంటర్ మహబూబ్ సుభానీ స్ట్రీట్, గుల్లాం అబ్బాస్ స్ట్రీట్, వించిపేటలో నిత్యావసర సరుకుల కిట్లను మంత్రి పంపిణీ చేశారు. వరద బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేషన్ కార్డు లేకున్నా నిత్యావసర సరకులు అందజేస్తామన్నారు. వించిపేటలో ఉర్దూ పాఠశాలను మంత్రి పరిశీలించారు.

అక్కడున్న వైద్య శిబిరాన్ని పరిశీలించి, ఏయే మందులు అందజేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది రోజులుగా అక్కడి వైద్య శిబిరంలో సేవలందిస్తున్న సచివాలయ హెల్త్ సెక్రటరీ వనిత జ్యోతిని మంత్రి అభినందించారు. అనంతరం స్కూల్లో తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులందరూ స్కూల్ కు హాజరైనట్లు ఉపాధ్యాయుడు రఘునాథ్ కృష్ణ వెల్లడించారు.

ఫైరింజన్ సాయంతో పాఠశాలను శుభ్రం చేసినట్లు ఉపాధ్యాయుడు వెల్లడించారు. వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలకు వచ్చిన వారు… పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా, యుద్ధ ప్రాతిపదికన పాఠశాలను పున:ప్రారంభించడంపై ఆనందం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి నుంచి ఇస్లాం పేట సెంటర్ లో వెళ్లిన మంత్రి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. త్వరితగతిన పారిశుధ్యం మెరుగుపర్చాలని, వీధుల్లో బ్లీచింగ్ చల్లాలని సూచించారు.

రేషన్ బండ్లు…వైద్య శిబిరాలు

54, 55 డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా స్కూళ్లు, సచివాలయాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని మంత్రి సవిత వెల్లడించారు. వీధుల్లో ఒకేసారి మూడు నాలుగు రేషన్ బండ్లుతో నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నామన్నారు. వరద బాధితులపై ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో, రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కూరగాయలు విక్రయించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారన్నారు.

షాపుల శుభ్రంపై వ్యాపారుల ఆనందం

బురదతో నిండిపోయిన షాపులను, ఇళ్లను ఫైరింజన్ల సాయంతో శుభ్రం చేయడంపై వ్యాపారులు ఆనందం వ్యక్తంచేశారు. తమను కలవడానికి వచ్చి మంత్రి సవితకు వారు ధన్యవాదాలు తెలిపారు. వరద నీటితో నిండామునిగిపోయిన షాపులను ప్రభుత్వమే శుభ్రం చేయడం అభినందనీయమన్నారు. వీధులను వరద నీరు తొలగించడంతో పాటు రోడ్లలన్నీ శుభ్రం చేయడంపై తోపుడు బండ్ల యజమానులు ఆనందం వ్యక్తంచేశారు. వ్యాపారాలు ఇపుడిపుడే గాడిన పడుతున్నాయన్నారు.

చంద్రబాబు దయతో తిండికి కొదవ లేదు
చంద్రబాబు దయ వల్ల ఇంట్లో ఉండి బయటకు కాకుండా నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం.. చంద్రబాబు నీళ్లలో పడవలో వచ్చి… పాలు, ఆహారం పొట్లాలు, బియ్యం, నీరు అన్నీ అందించారు. మాకు పనుల్లేకపోయినా.. తిండికి కొదవలేకుండా చూసుకుంటున్నారు…అని వించిపేటకు చెందిన వృద్ధురాలు…మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు. రేషన్ బండి వద్ద నిత్యావసర సరకులు పంపిణీని మంత్రి పరిశీలన వచ్చారు. అదే సమయంలో అక్కడున్న వారు మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలియజేశారు.

56 వ డివిజన్ లో పారిశుధ్య పనుల పర్యవేక్షణ
56వ డివిజన్ పాత రాజరాజశ్వేరి పేటలో మంత్రి సవిత పర్యటించారు. ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులు, ట్యాంకర్లతో తాగునీటి పంపిణీని పర్యవేక్షించారు. పాత రాజరాజేశ్వరి పేట మెయిన్ రోడ్డులో పారిశుధ్యం పనుల పరిశీలించారు. మంగళవారానికి రోడ్లన్నీ శుభ్రం చేస్తామన్నారు. రోడ్లు, కాలువలు శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను మంత్రి కొనియాడారు. అనంతం పాత రాజరాజేశ్వరి పేటలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్బారావు, ఫతావుల్లా అహ్మద్, షేక్ ఆషా, తాజుద్దీన్, సయ్యద్ సలీం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE