– టీడీపీ సెంట్రల్ ఆఫీసులో గణపతికి విశేష పూజలు
మంగళగిరి: వినాయక చవితి వేడుకల్లో భాగంగా బ్రహ్మాండ స్వరూపమైన లంబోధరుడికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం విశేషంగా పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ..
ఆది గణపతి దయతో అంతా శుభం జరగాలని కోరుకున్నట్టు తెలిపారు. పాడి పంటలతో రైతులు, చేతుల నిండా పనులతో కార్మికులు, ఆనందంగా ఉండాలని.. రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి యువనాయకుడు లోకేష్, కూటమి నేతల పాలనలో రాష్ట్రంలో పరిశ్రమల నిర్మాణం ఊపందుకొని, అభివృద్ధిలో ఏపీ ముందుండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఏవీ రమణ, ధారపనేని నరేంద్రబాబు, బుచ్చిరాంప్రసాద్, బొద్దులూరి వెంకటేశ్వరావు, చంద్రారెడ్డి, చప్పిడి రాజశేఖర్, దామోదర్ రాజు, కుమార్ చౌదరి, పార్టీ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.