Suryaa.co.in

Editorial

అదే జిత్వానీ.. అదే ఎస్‌ఐ..బట్ గవర్నమెంట్ ఛేంజ్

– జోగి రమేష్ అండతో పాతుకుపోయిన ఎస్‌ఐ పాపారావు
– ప్రభుత్వం మారినా ఇంకా ఆయనే కొనసాగింపు?
– ఇదేం పాలనంటూ టీడీపీ సోషల్‌మీడియా దళం ఫైర్
– దీనికోసమే ఐదేళ్లూ పోరాడిందని ఆవేదన
– ఎస్,సీఐల పోస్టింగు వడపోత పనితనం ఇదేనానంటూ ప్రశ్నల వర్షం
( సుబ్బు)

ఆయన ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ పాపారావు. చాలా ఏళ్ల నుంచి అక్కడే పాతుకుపోయారు. వైసీపీ పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయడు ఇంటిపై దాడి చేసినందుకు, మంత్రి పదవి బహుమతిగా పొందిన జోగి రమేష్ కళ్లలో ఆనందం కోసం.. జోగి సారు మెప్పు కోసం, అడ్డమైన పనులన్నీ చే సిన అధికారి అన్న ఘనకీర్తి ఆయన సొంతం.

ముంబయి నటి జిత్వానీ కుటుంబాన్ని అక్కడి నుంచి చెరబట్టి, ఇక్కడకు తీసుకువచ్చిన వ్యవహారంలో ఆయన పాత్ర కూడా పెద్దదేనట. ఆ విషయం ఎవరో కాదు. స్వయంగా బాధితురాలు జిత్వానీనే.. సీఐ అదే ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో అందరి ఎదుటే చెప్పి ఘొల్లుమంది. అసలు అధికారం మారినా తనను వేధించిన సదరు పాపారావు సారు, ఇంకా అదే పోలీసుస్టేషన్ చూరు పట్టుకుని వేళ్లాడుతుండటమే ఆమెను ఆశ్చర్యపరిచిందట. పాపం జిత్వానీకి ఆంధ్రా పాలిటిక్సు ఇంకా అర్ధమైనట్లు లేదు.ఆ ఘటనలో పాపారావు తనకు చేసిన అవమానం తలచుకున్న జిత్వానీ.. ఆ సీట్లో కూర్చున్న అక్కడ ఆయనను చూడటంతో ఆగ్రహం కట్టలు తెగిందన్నమాట.

దానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో, టీడీపీ సోషల్‌మీడియా సోల్జర్స్ పాలనాతీరుపై పెదవి విరుస్తూ పోస్టింగులు పెడుతున్నారు. ‘‘ప్రభుత్వం మారి మూడునెలలయింది. ఇంకా జోగి రమేష్ మనిషి పాపారావును అక్కడే ఎలా కంటిన్యూ చేస్తున్నారు? సీఐ,ఎస్‌ఐల వడపోతలో మీ పనితనం ఏమైంది? ఎమ్మెల్యేలకు బదులు మీరే సొంతంగా కసరత్తు చేసి పోస్టింగులు ఇస్తున్నారు కదా? మరి పాపారావు ఘనత మీకు తెలియదా? ఆయన జోగి రమేష్ అండతోనే ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తున్న సమాచారం మీ టీములకు తెలియదా? ఇలాంటి చర్యలతో కార్యకర్తల్లో సమరోత్సాహం నీరుగారిపోదా? ఇందుకోసమేనా మేం ఐదేళ్లు ఆ రాక్షసుడిపై యుద్ధం చేసి కేసులు పెట్టించుకుంది? ఇకనయినా మారండి సార్’’ అంటూ టీడీపీ సోషల్‌మీడియా సోల్జర్స్ నాయకత్వానికి కామెంట్ల రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకూ అక్కడేం జరిగిందంటే… ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో సినీనటి జిత్వాని ఎస్.ఐ పాపారావు ను చూడగానే.. ఆరోజు చాలా చేసావ్.వాటిని నేను మర్చిపోలేదు. మీ స్టేషన్లో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇప్పటికీ ఇక్కడే ఉన్నారా? అని ప్రశ్నించారు. దీనితో పోలీసులు ఏమీ మాట్లాడలేని పరిస్థితి..ఆ చిత్రమే ఈ ‘చిత్రం’.

శుక్రవారం ఇబ్రహీంపట్నం స్టేషన్ లో ఎస్సై పాపారావు ని చూడగానే జిత్వాని లో ఆవేదనతో ఒక్కసారిగా బైటకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో ముంబాయి నుంచి ఆమెను ఇబ్రహీంపట్నం స్టేషన్ కు తీసుకు వచ్చిన సమయంలో, ఒక్కో పోలీసు అధికారి సిబ్బంది ఆమె పట్ల వ్యవహరించిన తీరు, కళ్ళ ముందు మొదలాడింది. అక్కడే ఎస్.ఐ పాపారావు కనపడటంతో ఆమె అతన్ని చూసి ఆవేదన చెంది మాట్లాడింది.

ఈ స్టేషన్లో గత ఐదేళ్లుగా పాపారావు, అప్పటి మంత్రి జోగి రమేష్ అండతో విధులు నిర్వహిస్తూనే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి.

LEAVE A RESPONSE