– కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వైద్య నాథన్ కృష్ణ స్వామి కొనుగోలు కమిటీ సభ్యులుగా ఉన్నారు
– మీపాలనలో అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా ఎలా జరిగింది?
– మీ హయాంలో 14 సార్లు నెయ్యి ట్యాంకర్లు తిరిగి పంపించింది వాస్తవం కాదా?
– మీ పాలనలో సరఫరా చేసిన కంపెనీ నెయ్యి కంపెనీలే, మా హయాంలో సరఫరా చేస్తున్నది వాస్తవం కాదా?
మైసూరు ఎన్.ఎఫ్.టి.ఆర్. ఐ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు?
– ప్రధాని ఈ వివాదం లో జోక్యం చేసుకోవాలి
– టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి: లడ్డు ప్రసాదాలు విషయంలో స్వామి వారికి చంద్రబాబు కళంకితం అంట కడుతున్నారు. సాక్షాత్తు శ్రీవారిని పావుగా వాడుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నారు.
విజిలెన్స్ కమిటీ ద్వారా ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో, మూడు నెలలు తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోయే సరికి కుట్ర చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలు చూస్తూ ఊరుకోరు. నెయ్యి కు బదులుగా జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారు అంటూ విషం చిమ్ముతున్నారు. నీ ఆరోపణలు నిరూపించడానికి సుప్రీం కోర్టు విచారణ జరపాలని కోరుతున్నాం. ప్రధాని ఈ వివాదం లో జోక్యం చేసుకోవాలి.
ఇది నిజం అయితే రక్తం కక్కుకుని చావాలి అని శ్రీ వేంకటేశ్వర స్వామిని కోరుతున్నాం. స్వామివారే సరైన శిక్ష చంద్రబాబు కు విధిస్తారు.మీరు బెదిరించిన తర్వాత పంది కొవ్వు, చేప నూనె ఉన్నాయని ఈవో చెప్తున్నారు. చంద్రబాబు పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత, వాడని నెయ్యి వాడారు అని అబద్ధాలు చెబుతున్నారు.
మీ పాలనలో ఆరు నెలలే నందిని డైరీ వాడారు అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అతి తక్కువ ధర కు నెయ్యి సరఫరా మీపాలనలో ఎలా జరిగింది? నిజం కాదా? మీ హయాంలో 14 సార్లు నెయ్యి ట్యాంకర్లు తిరిగి పంపించింది వాస్తవం కాదా? టీడీపీ పాలనలో అప్పటి టిటిడి హెల్త్ ఆఫీసర్ శర్మిష్ఠ, నెయ్యి నాణ్యత లేని ట్యాంకర్లు వెనక్కి పంపిస్తామని, తిరుమల ల్యాబ్ లో మూడు టెస్టు లు నిర్వహిస్తాం అని చెప్పలేదా? మీ పాలనలో సరఫరా చేసిన కంపెనీ నెయ్యి కంపెనీలే, మా హయాంలో సరఫరా చేస్తున్నది వాస్తవం కాదా?
మైసూరు ఎన్.ఎఫ్.టి.ఆర్. ఐ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు?
టిటిడి పార్టీ కార్యాలయం కు ఎందుకు రిపోర్ట్ వెళ్ళింది? నెయ్యి కొనుగోలుకు నిపుణులు కమిటీ తో పాటు, పాలక మండలి సభ్యులు కూడా ఉంటారు. ఇప్పుడు టిడిపిలో మంత్రి గా ఉన్న కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వైద్య నాథన్ కృష్ణ స్వామి పాలక మండలి సభ్యులు గా, నాటి కొనుగోలు కమిటీ సభ్యులుగా ఉన్నారు. దీనిపై నిజం నిగ్గు తేల్చండి.
ఏ విచారణకు అయినా మేము సిద్ధం. మా పాలనలో ఏవిధమైన ఆరోపణలు విచారణకు మేము సిద్ధం. ఎస్వీబీసీ ఛానెల్, స్వామి వారిని దళిత వాడలకు దళిత గోవిందం పేరుతో గొప్ప కార్యక్రమం, వేద విశ్వ విద్యాలయం, రెండు లక్షలు వేద విద్యార్థులు పేరుతో డిపాజిట్, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించింది మేమే.
దళిత , బలహీన వర్గాల పెళ్ళిళ్ళు, 36వేల పేద జంటలకు కల్యాణోత్సవం పేరుతో బంగారు తాళి బొట్లు ఇచ్చింది మా పాలనలోనే. అన్నమయ్య ఉత్సవాలు నిర్వహించింది మేమే. 75 మంది వేద పండితులు తో విద్వత్ సదస్సు, చిన్న పిల్లలకు దైవ భక్తి పెంచేందుకు గోవిందా కోటి , రామ కోటి పెట్టి స్వామి దర్శనం నిర్వహించినది మేమే. కానీ , మీపాలనలో తిరుమలలో మద్రాస్ నల్లి స్టోర్ కు చెందిన గెస్ట్ హౌస్ లో వ్యభిచారం గెస్ట్ హౌస్ నిర్వహించారు.
స్వచ్ఛమైన ఆవు నెయ్యితో, నవనీత సేవ ప్రారంభించింది జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే. వెయ్యికి పైగా నాటు ఆవులతో స్వచ్ఛమైన 60 కిలోల నెయ్యి, నవనీతం సేవ శ్రీకారం చుట్టాము. చంద్రబాబు నీకు పాప పరిహారం తప్పదు. మేము తప్పు చేస్తే రక్తం కక్కుకుని చావాలని స్వామిని కోరుతున్నా.
మీ ప్రభుత్వం సి.బి. ఐ విచారణ చేపట్టాలని కోరుతున్నాం. తిరుమల కొండపై ఎప్పటి నుంచో ల్యాబ్ ఉంది. చంద్రబాబు నాయుడు అనుకూలమైన రిపోర్ట్ లు వచ్చే ల్యాబ్ లు తిరుమల కొండపై లేదు అని ఈవో చెప్తున్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆలయ శుద్ధి అంటున్నాడు. ముఖ్య మంత్రి ఆలయ శుద్ధి గురించి ఎలా చెబుతారు? ఆగమ పండితులు చెప్పాల్సిన అంశం ఇది.
తిరుమలలో శ్రీ వైష్ణవులు చేతిలో లడ్డూలు తయారు చేస్తారు, ఏమాత్రం తప్పిదం జరిగిన ఉపేక్షించరు. శ్యామల రావు చంద్రబాబు ఉద్యోగి. టిటిడి ఈవో గా పనిచేయడం లేదు.శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ దిగదార్చే విధంగా ఎవరు మాట్లాడినా ఖండించాలి.ఏ పార్టీకి సంబంధించిన అంశం కాదు, చంద్రబాబు చేతిలో మీడియా ఉంది. మేము బలహీనంగా ఉన్నాము. మా వార్తలకు ప్రాధాన్యత ఇవ్వండి.