• లోకేష్ ట్వీట్ ను వక్రీకరించిన బురద మీడియా
• టీటీడీకి అడల్ట్రేట్స్ ను కనిపెట్టే అత్యాధునిక ల్యాబొరేటరీ లేదన్న ఇవో
• జూన్ 12, 20, 25, జూలై 4న టీటీడీకి వచ్చిన ట్యాంకర్లు
– వీటి శ్యాంపిల్స్ ను టీటీడీ ఎన్డీడీబీకి టెస్టు కోసం పంపింది
• ఆ రిపోర్టు వచ్చాకే ప్రభుత్వం దిద్దుబాటు
– నందిని నెయ్యి స్వీకరణ
• ఐజీ స్థాయి వారితో ఇన్ వేస్టిగేషన్ చేస్తాం…
– బాధ్యులపై కఠిన చర్యలు
– జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
మంగళగిరి: తిరుమలలో మీరు చేసిన పాపాలు వక్రభాష్యాలతో తుడిచి పెట్టలేరంటూ, సాక్షి బురద పత్రికతో పాపాలు కప్పిపుచ్చుకోవాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి జాతీయ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. తిరుమల కేంద్రంగా గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా… కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి… జగన్మోహన్ రెడ్డి సొంత బంధువర్గం అయిన వీరి హయాంలో జరిగిన అక్రమాలు, చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అన్నింటికన్నా మించి వీరు క్షమించరాని మహాపాపం ఏమిటంటే స్వామి వారి నైవేద్యం అయిన లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో కలుషితం చేసి, డబ్బు కక్కుర్తితో ఏఆర్ పుడ్స్ లాంటి కంపెనీలతో కుమ్మకైయ్యారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో జంతువులకు సంబంధించి కల్తీ పదార్థాలతో కలుషితం చేసి.. స్వామి వారి ప్రసాదం కూడా అడల్ట్రేట్ చేసిన వారిని క్షమించకూడదు. దీనికి సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రపంచమంతా అంటే హిందూ మతాల వారే కాదు అన్ని మతాల వారు నిర్గాంతపోయారు.
పాపం తాలుకా వాస్తవాలు అనేక ల్యాబ్ రిపోర్టుల ద్వారా బయటపడ్డాయి. అయినా కూడా జగన్ రెడ్డి అండ్ కో బుకాయించే ప్రయత్నంలో ఉంది. వారి చేతిలో ఉన్న ఒక అవినీతి బురద పత్రికను అడ్డంపెట్టుకుని ఇంకా తప్పుడు రాతలు రాస్తూ, వక్రభాష్యాలు పలుకుతూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డి. ఏఆర్ పుడ్స్ వారి అడల్ట్రేట్ ఘీ లో జంతువుల కొవ్వుతో కలుషితమైన ఆ నెయ్యిని వాడలేదని… వాడకుండానే వాడినట్టు ప్రజలను మభ్యపెడుతున్నారని నానారకాలు తప్పుడు రాతలు రాస్తున్నారు. వీళ్లు ఈ బురద పత్రికలను అడ్డుపెట్టుకుని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడమే కాకుండా… మీడియాలో ఉన్న కొంత మంది పెయిడ్ అర్టిస్టులను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో ట్వీట్ లను పెట్టించడం, స్టేట్ మెంట్లు ఇప్పించడం లాంటి కార్యక్రమాలకు తెరలేపారు.
నారా లోకేష్ పెట్టిన ట్వీట్ లో ఏఆర్ పుడ్స్ కంపెనీ తో వీళ్లు కుమ్మకై.. కాసులకు కక్కుర్తి కోసం జగన్ రెడ్డి హయాంలో ఏ టెండర్ ను అయితే ఖరారు చేశారో మే 8, 2024 న ఎవరి హయాంలో అయితే ఏఆర్ ఫుడ్స్ కు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో మే 15 వ తేదీన ఆ కంపెనీ 8 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది. ఆ 8 ట్యాంకర్ల నేయిలో 4 ట్యాంకర్ల నెయ్యి వాడారు. 4 ట్యాంకర్ల నెయ్యి సాంపుల్స్ తీసుకుని ఎన్డీడీబీకి పంపించి, రిపోర్టులు తీసుకున్నారు. ఆ రిపోర్టులో యానిమల్ ఫాట్ కలిసిందని బయటపడిందో అప్పుడే ఆ నాలుగు ట్యాంకర్లను నిలిపివేశారని నారా లోకేష్ చాలా స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలిపారు. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడారు. అదుగో నారా లోకేష్ చెప్పారు. ఏ 4 ట్యాంకులనైతే ఎన్డీడీబీ కి పంపారో వాటిని అసలు వాడలేదని చెబుతున్నారు… కాబట్టి ఆ అడల్రేట్ ఘీ ని వాడలేదని… వాడకుండానే వాడామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఇష్టానుసారంగా రోత రాతలు రాస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఒకమాట చెబుతుంటే, నారా లోకేష్ ఇంకోమాట చెబుతున్నారని వక్రీకరించడం, వక్రభాష్యాలు చెప్పడం చేస్తున్నారు. కానీ ఈ బుద్ధి తక్కువ వారు ఎవరైతే ఉన్నారో వారందరు కూడా కామన్ సెన్స్ తో ఆలోచించాలి. ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు 8 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేస్తే… 4 ట్యాంకర్ల నెయ్యిని వాడినప్పుడు ఆ నాలుగు ట్యాంకర్లలో శుద్ధమైన ఆవు నెయ్యి ఉంటుందని నమ్మగలమా.. ? ఏ కంపెనీ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రూ.319 లకే ఆవు నెయ్యిని సరఫరా చేస్తానని ముందుకు రావడం… ఆ కంపెనీకి వీళ్లు కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టు ఇచ్చారు. వీరు సరఫరా చేసిన 8 ట్యాంకర్ల నెయ్యిలో 4 ట్యాంకర్ల నెయ్యి ఏదైతే టీటీడీ వాళ్ళు వాడారో దాంట్లో కల్తీ లేని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటుందని నమ్మగలమా..?
ముందుగా ఏఆర్ ఫుడ్స్ సరఫరా ఆ నాలుగు ట్యాంకర్లు ఏమైనా కిలో రూ.500, 600 లకే అమ్మారా.. రూ.319 లకే గా అమ్మింది. అంటే దాంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇస్తారా? దాంట్లో … మొదటి నాలుగు ట్యాంకర్ల నెయ్యి ని తిరుమలకొండపై ఉన్న లేబరేటరీ లో ఆ నెయ్యిలో స్వచ్చత మాత్రమే కనుగొనేటువంటిది మాత్రమేనని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమలలో అడ్వాన్స్ లేబరేటరీ లేదు. ఆ లేబరేటరీలో కేవలం రంగు, మాయిచ్ఛర్, ఫ్యాటీయాసిడ్స్ ,ఆర్ ఎం వ్యాలువ్, మినరల్ ఆయిల్స్ ఏమైనా కలిసాయోమో తెలుసుకునే లేబరేటరీ మాత్రమే ప్రస్తుతం ఉంది. అంతేకాని యానిమల్ ఫ్యాట్ లాంటి కలుషితమైన పదార్థాలు కలిసాయని చెప్పే లేబరేటరీ లేదు. ఆ విషయాన్నేఈవో చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి సాంపుల్స్ ను ఎన్డీడీబీకి పంపించింది. అలా పంపించిన తర్వాత ఇలాంటి అకృత్యాలు బయటపడ్డాయి. ముందు నాలుగు ట్యాంకర్లు లాబ్ టెస్టు పాస్ అయ్యాయా అంటే అదేమీ స్వచ్ఛమైన నెయ్యి కాదు. సర్టిఫై చేసిన పరిస్థితి కూడా అక్కడ లేదు. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే కాని అర్థమయ్యే విషయాలు ఇవి… దాన్ని కూడా వక్రీకరించి వాడలేదు.. వాడకుండానే వాడేశామని వక్రభాష్యం చెబుతున్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఏవైతే 4 ట్యాంకర్ల నెయ్యిని వాడాక భక్తుల నుంచి లడ్డూలు వాసన వస్తుందని ఫిర్యాదు వచ్చాయో అప్పుడు ఈవో శ్యామల రావు మిగతా 4 ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీకి టెస్టింగ్ కి పంపించారు. మొదటి 4 ట్యాంకర్లను కూడా మొదటిది జూన్ 12 , 20, 25న, జూలై 4న ట్యాంకరు టీటీడీకి వచ్చాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని… తప్పుడు రాతలు వక్రబాష్యాలు చేసి ఇంకా ఏదో తప్పించుకోవాలని రోత పత్రికలను అడ్డుపెట్టుకుని ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్న వారి దుర్భుద్ధిని ప్రజలు గమనించాలని కోరారు.
రెండోది ప్రతిసారి వారు చెప్పే మాట ఏమిటంటే జూలై 23వ తేదిన రిపోర్టు వచ్చిన తర్వాత సెప్టెంబర్ 18, 19 వ తేది వరకు ఎందుకు ఆగారని.. టీడీపీ ప్రభుత్వం ఆ వాస్తవాన్ని ఎందుకు బయటపెట్టలేదని పదే పదే మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి కూడా తన లేఖలో అదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయం కూడా ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రప్రభుత్వంలో టీటీడీ తీసుకున్న చర్యలు కూడా గమనించాలి. ఎప్పుడైతే ఆ రిపోర్టు బయటకు వచ్చిందో… అప్పుడే 4 ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయడం, ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్టులో పెట్టడం, వారిపై చర్యలకు ఉపక్రమించడం, విజిలెన్స్ ఏంక్వైరీని ఆదేశించడం… అంతేకాకుండా ఒక ఎక్స్ పర్ట్ కమిటీని.. నలుగురు ఏమినెంట్ పర్సనాలిటీస్ తో… డాక్టర్ బి సురేంద్రనాధ్ డైరీ ఎక్స్ పర్ట్, ఎం.విజయ బాస్కర్ డైరీ ఎక్స్ పర్ట్ ఇన్ హైదరాబాద్, డాక్టర్ జి. స్వర్నలత డిపార్ట్ మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ర్టీ వెటనరీ యూనివర్సిటీ కామారెడ్డి, ప్రొఫెసర్ మాధవన్ ఐఏయం బెంగుళూర్. ఈ నలుగురితో ఒక కమిటీని నియమించి ఈ వ్యవహారంపై భవిష్యత్తులో ఇలాంటి జరగకుంగా ఉండాలంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుని, మళ్లీ కొత్త టెండర్ ను ఆహ్వనించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని ఘీని సరఫరా ని పునరుద్ధరించారు.
ఎప్పుడైతే ఈ రిపోర్డు బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అంతేకాకుండా దీని వెనుక బాధ్యులు ఎవరున్నారో తెలుసుకోవడం కోసం విజిలెన్స్ ఎక్వైరీని ఆదేశించింది. వైవీ సుబ్బారెడ్డికి, ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు ఇచ్చింది. ఇన్ని రకాలైన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్ మెంట్ వారు ప్రాథమిక దర్యాప్తు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక నివేదిక ఇచ్చింది. అప్పడు ముఖ్యమంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. బాధ్యత గల వ్యక్తి చేసే పని అది.
కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం దృష్ట్యా ఎవరూ క్యాజువల్ గా మాట్లాడరు. మొన్న జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు… ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఇది వెరీ కామన్ గా జరుగుతూ ఉంటుందని ఎంత తేలిగ్గా కోట్టిపారేసారో… మొన్న మీడియా ముందు చూశాం. కానీ మన చంద్రబాబు అటువంటి వ్యక్తి కాదు. అన్ని విషయాలను ధ్రువీకరించుకుని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజలను భయాందోళనలకు గురిచేయడం బాధ్యతగల నాయకుడు చేసే పని కాదు. దిద్దుబాటు చర్యలు తీసుకోని ఒక నమ్మకాన్నిప్రజలకు కలిగించిన వ్యక్తి చంద్రబాబునాయుడు. 2 నెలలు ఎందుకు ఆగారు.. అనే ప్రశ్నించడం సరికాదు. జగన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో ఫిటిషన్ వేస్తారు. కానీ ఎంత బాధ్యత లేకుండా మాట్లాడంటే … బంగారంలో రాగి కలుపుతారు గానీ రాగిలో బంగారం కలుపుతారా అంటూ లాజిక్ మాటలు. అంటే ఆయన ఉద్ధేశంలో పందికొవ్వు బంగారం అంటా… అంటే బంగారం లాంటి పంది కొవ్వును… రాగి లాంటి ఆవు నెయ్యిలో కలుపుతాడా…అంటూ మాట్లాడారు.
టెండర్ డాక్యుమెంట్లను మార్చేసి వైవీ సుబ్బారెడ్డి రిజల్యూషన్ నెంబర్ 371, 29 ఫిబ్రవరి 2020న మారుస్తూ సంతకం పెట్టారు. గతంలో ఆవు నెయ్యి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వారు 3 స.రాల అనుభవం ఉన్న వాళ్లే టెండర్ పాల్గొనాలి. దాన్ని ఒక సంవత్సరానికి తగ్గించింది ఎవరు మీరు కాదా..? రూ. 250 కోట్ల మినిమమ్ టన్నోవర్ ఉండాలి దాన్ని 150 కోట్లకు తగ్గించింది మీరు కాదా..? అంతేకాకుండా మినిమం కలెక్టింగ్ కేపాసిటీ 4 వేల లీటర్లు ఫర్ డే ఉండాలి. దాన్ని పూర్తిగా తీసేసింది మీరు కాదా..? పనికిమాలిన కంపెనీని తెర మీదకు తీసుకువచ్చి … నందిని నెయ్యి తరిమేసి ఇన్నీ పాపాలు చేసి మీరు మాట్లాడతారా.. నందిని నెయ్యిని మీరు సెలక్ట్ చేసింది రీవర్స్ టెండరింగ్ లోనే కదా? భవిష్యత్తులో రీవర్స్ టెండరింగ్ విధానం ఉండదు. లోకేష్ ట్వీట్ ను తప్పుబట్టడం మంచిది కాదు. లోకేష్ ఒకమాట చంద్రబాబు ఒక మాట్లాడరు. వాస్తవాలు ఎప్పుడూ ఓకేలాగా ఉంటాయి. సిట్ ద్వారా విచారణ చేసి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిది.