– తుని ఎమ్మెల్యే యనమల దివ్య
తుని: సంక్షేమ పధకాలతో నవ్యాంధ్ర ప్రదేశ్ పురోభివృద్ధికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు.
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల టిడిపి అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యనమల దివ్య కోటనందూరు మండలం కేవో అగ్రహారం, లక్ష్మీదేవి పేట గ్రామాల్లో పర్యటించారు.కేవో అగ్రహారంలో స్థానిక నాయకులు కాపారపు శివకుమార్, యలమంచిలి చిట్టిబాబు,మిరియాల సత్యనారాయణ, యలమంచిలి అప్పల రమణలతో కలిసి, ఎన్డీయే కూటమి ప్రభుత్వ వందరోజుల పాలన విజయాలను వివరించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అనంతరం ఇంటింటికీ వెళ్ళి వందరోజుల పాలన స్టికర్లు అంటించారు.