Suryaa.co.in

Telangana

మద్దతు ధరతో పాటే రైతుల అకౌంట్లలో బోనస్ వేయాలి

– సీఎం రేవంత్ కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లేఖ

హైదరాబాద్: అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించడం తో పాటు మద్దతు ధరతో పాటే రైతుల అకౌంట్ల లో బోనస్ వేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ధి సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన సీఎంకు బహిరంగలేఖ రాశారు.
సుదర్శన్‌రెడ్డి లేఖ పూర్తి పాఠం ఇదీ..

07-10-2024
నర్సంపేట

ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల
రేవంత్ రెడ్డి గారికి..

విషయం : రైతు పండించిన ధాన్యానికి బోనస్ చెల్లింపుల గురించి..

రైతుపండించిన ధాన్యానికి బోనస్ గురించి గత ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రతీ పంటకు బోనస్ ఇస్తామని ప్రకటించారు.అందులో ప్రధానమైనది వరి పంట.ధాన్యానికి క్వింటాలుకు 500/- రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు.ఆనాడు ఉన్న 2183 రూపాయల మద్దతు దరను మ్యానిఫేస్టోలో 500/- రూపాయలను కలుపుతూ విడుదల చేశారు.

సదరు దర దొడ్డు రకాలకు ఉన్నది.అయితే సన్న రకానికే మద్దతు దర ఇస్తాం దొడ్డు రకం ధాన్యానికి ఇవ్వమంటూ మోసపూరిత ప్రకటన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్రంలో నేడు వరి సాగైన విస్తీర్ణం సుమారు 60,39,000 వేల ఎకరాలు.దిగుబడి అంచనా ఈ ఖరీఫ్ కు1,46,28,000 మెట్రిక్ టన్నులు ఇందులో సన్న రకాల సాగు విస్థిర్ణం 36,80,000 ఎకరాలు..సన్నదాన్యం దిగుబడి అంచనా 88,09,000 మెట్రిక్ టన్నులు,దొడ్డు రకాల సాగు విస్థీర్ణం 23,59,000 ఎకరాలుంటే, దొడ్డు ధాన్యం దిగుబడి అంచనా 58,18,000 మెట్రిక్ టన్నులుగా ఉందని ప్రభుత్వం ఇటివల అంచనా వేసినట్టు ప్రకటన చేసింది.

మొత్తం అన్ని రకాల ధాన్యాలకు 500 బోనస్ ఇవ్వాలనే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. రైతు వ్యతిరేఖ,రైతులను ఆగం చేసి నిర్ణయాలు కాంగ్రేస్ ప్రభుత్వం చేస్తే వారి నాశనం వారే కొనితెచ్చుకున్న వారవుతారు.. ఈ ఖరీఫ్ కు అంచనా వేసిన 1,46,28000 మెట్రిక్ టన్నుల దాన్యానికి బోనస్ 500 రూపాయలు అంటే సుమారు 7314 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

సన్న రకాలకు సంబంధించి 88,09,000 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారో అందుకు సంబందించి కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు దర 2320 రూపాయలుగా ఉంది.హామీ ఇచ్చిన 500 బోనస్ కలుపుకుని 2820/- రూపాయలు అవుతుంది..అంటే సన్నరకం దాన్యానికి సుమారు 4404 కోట్ల రూపాయల బోనస్,దొడ్డు రకం వడ్లకు 2909 కోట్ల రూపాయలు బోనస్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మొత్తం దాన్యంలో కోతలు పెడుతూ ప్రభుత్వం క 47 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం మాత్రమే కొనుగోలు చేస్తుంది..ఈ ధాన్యానికి 2350 కోట్లు వెచ్చిస్తుంది..అంటే మొత్తం ధాన్యం కు ఇచ్చే బోనస్ 7314 కోట్లు ఉంటే ప్రభుత్వం రైతును మోసం చేస్తూ కేవలం 2350కోట్లు మాత్రమే బోనస్ చెల్లించే విదంగా కొర్రీలు,కోతలు పెడుతుంది..ఈ చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మితేనే బోనస్ ఇస్తామనటం సరైనది కాదు.. క్రాఫ్ బుకింగ్ పోర్టల్ లో వ్యవసాయ శాఖ వద్ద రైతు వివరాలు,పంట విస్థీర్ణం వివరాలు నమోదై ఉన్నాయి.దాని ఆదారంగా దిగుబడిని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.అంచనా వేసిన మొత్తం ధాన్యానికి క్వింటాలుకు 500/- రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

సన్నరకం బోనస్ తో కలిపి 2820 రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది.ప్రైవేటు వ్యాపారులు,మిల్లర్లు,ఇతర ట్రేడర్లు ఇప్పటికే పచ్చి వడ్లను తేమశాతం పరిగణలోకి తీసుకోకుండా 2600/- రూపాయల నుండి 3000/- రూపాయలు వరకు మార్కెట్ లో అమ్ముడవుతుంది.

అలా జరిగినప్పుడు రైతులు తమ పంటకు ఎక్కువ దర వచ్చే చోటనే అమ్ముకుంటారు..కాంగ్రేస్ ప్రభుత్వం బోనస్ తో కలుపుకున్నా 2820 రూపాయలు మాత్రమే అవుతున్నప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మితే రైతుకు 200 రూపాయల నష్టం జరుగుతుంది..రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో పంటను అమ్మలేదనే సాకుతో బోనస్ ను ఎగ్గొట్టే ప్రయత్నం కాంగ్రేస్ ప్రభుత్వం చేస్తుంది.

ప్రదానంగా రైతు ఎక్కడ తన ధాన్యాన్ని అమ్మినా బోనస్ ను చెల్లించాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.. ఉదాహరణకు ఒక రైతు తన ఎకరం సాగు చేసి 30 క్వింటాల్ల పంట వచ్చింది అనుకున్నప్పుడు సదరు రైతు పండించిన పంట వ్యవసాయ శాఖ క్రాఫ్ బుకింగ్ పోర్టల్ లో నమోదు అయి ఉంటుంది కాబట్టి,సదరు రైతు ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకున్నా అతని 30 క్వింటాళ్ళకు సంబందించిన 15వేల రూపాయలను సదరు రైతు ఖాతాలో జమ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.

ప్రైవేట్ మార్కెట్ లో ధర పడిపోయినప్పుడు రైతు తిరిగి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని అమ్ముతాడు,లేదా దర ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకుంటాడు..ప్రభుత్వానికి ధాన్యం అమ్మితేనే బోనస్ వర్తిస్తుందని,ప్రైవేట్ గా అమ్ముకుంటే బోనస్ వర్తించదనటం రైతును ఆర్థికంగా వంచించటమే అవుతుంది.రైతు కష్టపడి పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలనే స్వేచ్చ రైతులకు ఉంది.

కాంగ్రేస్ ప్రభుత్వ ఈ బోనస్ చెల్లించే విషయంలోనూ కొర్రీలు పెడుతున్నట్టు సమాచారం.పాత పద్దతిలోనే కేవలం మద్దతు దరను మాత్రమే రైతులకు చెల్లించి బోనస్ 500/- తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామనటం దాటవేత ధోరణికి నిదర్శనం.ఇప్పటికే కనీసం 50% కూడా కానీ రైతు రుణమాఫీ పూర్తైందని చెప్పడం,రైతుభరోసాను ఒక సీజన్ కు ఎగ్గొట్టడం,ఇప్పుడు బోనస్ ను తర్వాత చెల్లిస్తామనటం ఇది హామీలను విస్మరించే కుట్రలో బాగమనే భావిస్తున్నాం.

ఈ చర్యలు ఏ మాత్రం ఉపేక్షించేదు లేదని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ హెచ్చరిస్తుంది. క్రాప్ బుకింగ్ ఫోర్టర్ లో వచ్చే దిగుబడిలో ప్రతీ క్వింటాల్ కు 500/- రూపాయలు అకౌంట్ లో వేయాలని,రైతు ధాన్యం ఎక్కడ అమ్మినా బోనస్ ను వారి ఖాతాల్లో వేయాలి,దాటవేయడం కాకుండా వెంటనే బోనస్ ను చెల్లించి ప్రభుత్వం మ్యానిఫేస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని,లేని పక్షంలో అది బోగస్ హామీగా ప్రజలు భావిస్తారని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం..

– పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే

(బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు)

LEAVE A RESPONSE