-
గుడివాడ ప్రజల సమస్యల పరిష్కారానికి అంచనాలు రూపొందించండి
-
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
-
గుడివాడ పురపాలక సంఘ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే
-
ప్రత్యూమ్నాయ మార్గాల ద్వారా టీడ్కో కాలనీలో సమస్యల పరిష్కారానికి చర్యలు
-
పనిచేసే అధికారులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుంది
గుడివాడ: గుడివాడ పట్టణ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు అంచనాలు రూపొందించాలని….. గుడివాడ అభివృద్ధికి అతి త్వరలో నిధులు వస్తున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో టీడ్కో కాలనీలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతున్నామన్నారు.
గుడివాడ ఏలూరు రోడ్డు ప్రజావేదిక కార్యాలయంలో పురపాలక సంఘ అధికారులతో ఎమ్మెల్యే రాము శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాటర్ వర్క్స్, శానిటేషన్ ఇతర ప్రజా సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు.
ప్రధానంగా గుడివాడలో చిన్న చిన్న సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అవి పెద్ద సమస్యలుగా మారి ప్రజలను కష్టపెడుతున్నాయని….. ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
జల్ జీవన్ అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేయాలని ఎమ్మెల్యే రాము అధికారులను ఆదేశించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తిస్థాయిలో సమస్యల పరిష్కారానికి సాధ్యమవుతుందని….టీడ్కో కాలనీలో సమస్యల పరిష్కారానికి 221 బ్లాక్ ల నివాసితులతో అసోసియేషన్ ఫామ్ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు.
సెలవు రోజు కూడా సమావేశంలో పాల్గొన్న అధికారులకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి తాను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు.
ప్రజలకు జవాబుదారులుగా ఉంటూ…… ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు మంచి చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ పి. శ్రీనివాస్, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు చేవూరు జగన్మోహన్రావు, పెద్దు శ్రీకాంత్, పురపాలక సంఘ డి.ఈలు సతీష్ చంద్ర, వరప్రసాద్
ఏఈలు ప్రభాకర్, తేజస్విని ,జ్వాల దీప్తి, పబ్లిక్ హెల్త్ డి.ఈ పాండురంగారావు, డ్రాప్స్ మేన్ లీలా ప్రసాద్,పాండురంగారావు, తదితరులు పాల్గొన్నారు.