-పోలీసుల లాఠీఛార్జ్
-తీవ్ర ఉద్రిక్తత
-సికింద్రాబాద్లో ఇంటర్నెట్ బంద్
హైదరాబాద్: సికింద్రాబాద్ రణరంగంగా మారింది. హిందూ సంఘాల కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపైకి కార్య కర్తలు చెప్పులు, కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మరోవైపు మతఘర్షణలు చెలరేగకుండా సికింద్రాబాద్లో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం.