కందుల వేణు వర్ధన్
అమరావతికి మళ్ళీ పునర్వైభవం వచ్చింది అని తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత, పెదకాకాని మండలం తెలుగుదేశం పార్టీ నేత కందుల వేణు వర్ధన్ అన్నారు. సోమవారం తెనాలి మారిస్ పేట ఆయన నివాసం వద్ద కందుల వేణు వర్ధన్ మాట్లాడుతూ… వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే రాజధాని పునర్నిర్మాణ పనులు చేపట్టిందని తెలిపారు. ప్రజా రాజధానికి ఐదేళ్ల గ్రహణం వీడిందని… అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న బలమైన సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రాష్టానికి రాజధాని లేకుండా ఐదేళ్ల విధ్వంసకర పాలన చేసిన వైసీపీ కే దక్కుతుంది.
గతంలో రాజధాని ప్రాంతం 80 శాతం నిర్మాణాలు పూర్తయిన భవనాలను శిథిలావస్థకు తీసుకు వచ్చి విధ్వంసకర పాలన వైసీపీ పాలన చిరునామాగా మారిందని కందుల వేణు వర్ధన్ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ పేరుతో అన్ని ప్రాంతాలు ప్రగతి విధ్వంసం చేశారని వివరించారు అమరావతి పరిరక్షణ రైతులు, ఇక్కడి ప్రజలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు రాజధానికి జీవం పోయడానికి ఆర్థికంగా చేయూత. కేంద్ర ప్రభుత్వం చొరవతో 15 వేల కోట్ల సాయం అందించేందుకు ప్రపంచబ్యాంకు ఏడీబీ ముందుకొచ్చాయన్నానని తెలిపారు. త్వరలోనే ప్రపంచ ఖ్యాతి నగరంగా అమరావతి సరి కోత్తగా ఉంటుంది కందుల వేణు వర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు.