– తిరుపతిలో బాంబు బెదిరింపుల పరంపర
– రాజు పార్కు కు ఫోన్ కాల్ బెదిరింపు
– అలిపిరి పోలీసులు అప్రమత్తం
– డాగ్ బాంబు స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు
తిరుపతి: పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలోని పెద్దపెద్ద హోటళ్లకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపుల బెడద తప్పటం లేదు. దీంతో తిరుపతి పోలీసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు పార్క్ హోటల్ కు శ బాంబు బెదిరింపు అలజడి సృష్టించింది. అలిపిరి సీఐ. రామ్ కిషోర్ తన సిబ్బందితో హోటల్ కు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముమ్మురంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరంలోని హోటళ్లకు ఇలా బాంబు బెదిరింపులు రావటంతో పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు.