Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపండి

  • ఎక్కడైనా లంచం తీసుకున్నట్లు నా దృష్టికి వస్తే ఉపేక్షించను
  • అధికారులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశం
  • ప్రభుత్వ ప్రజా ఫిర్యాదుల దినోత్సవానికి హాజరైన పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అధికారులకు ఆదేశించారు గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం కొత్తచెరువు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రజల నుంచి పిర్యాదులు స్వీకరించారు.

ప్రజల నుంచి వచ్చే సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వాటికి పరిష్కారం చూపాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ప్రజల నుంచి అధికారులు కానీ ,స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా లంచం తీసుకున్నట్లు తన దృష్టికి తీసుకువస్తే అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యుత్ ,త్రాగునీరు, పారిశుధ్యం ,రెవిన్యూ, సమస్యలపై పిర్యాదులు స్వీకరించారు.వీటికి వెంటనే పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.

కొత్త చెరువు లోని బీసీ వసతి గృహం శిథిలావస్థకు చేరుకొని వర్షం వస్తే మొత్తం కారుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సంబంధిత అధికారులతో పోన్ లో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ,మండల టీడీపీ నాయకులు సాలెక్క గారి శ్రీనివాసులు ,పట్టణ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE