-పాలకులకు కొమ్ముకాస్తారో ..ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తారో సమీక్షించుకోవాలి
-భవిష్యత్తులో ప్రజల ముందు దోషులుగా నిలబడతారు
-రేవంత్ కుట్రల్లో పావులుగా మారుతున్న పోలీసులు
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఇంట్లో జరుగుతున్న కుటుంబ ఫంక్షన్ మీద పోలీసులను ప్రయోగించడం గర్హనీయం. కుటుంబంలో జరుగుతున్న శుభకార్యం మీద పోలీసులు దాడి చేస్తే రేవ్ పార్టీగా చిత్రీకరించడం దుర్మార్గం.
మీడియా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పాలకులకు కొమ్ముకాస్తారో ? ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తారో సమీక్షించుకోవాలి. మీడియా పెడధోరణి వీడకుంటే భవిష్యత్తులో ప్రజల ముందు దోషులుగా నిలబడతారు. కేసీఆర్ పాలనలో దేశానికి మకుటాయమానంగా తీర్చిదిద్దిన పోలీసు వ్యవస్థను, పది నెలల పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది.
ప్రభుత్వ పనిభారం భరించలేక పోలీసులు నిరసనకు దిగడం దేశంలోనే తొలిసారి. ఏక్ పోలీస్ విధానం అని హామీ ఇచ్చిన రేవంత్, దానిని తుంగలో తొక్కి ప్రశ్నించిన పోలీసులను సస్పెన్షన్, డిస్మిస్ చేయడం దారుణం. రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారిని మోసగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.
5 డీఏలకు ఒక డీఏ ఇచ్చి దీపావళి కానుక అని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యం అంటూ హైదరాబాద్ లో నిరసనలను నివారించేందుకు కర్ఫ్యూ ప్రకటించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. పేదల కన్నీళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం.