• బ్రహ్మండ సినిమా పోస్టర్, టీజర్ విడుదల చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
• ఆనాటి జానపదాలను ఈ తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది
• ఈ రోజుల్లో మంచి కథ ఉన్న ప్రతీ సినిమా పెద్ద సినిమానే
• ఒగ్గు కళాకారుల జీవిత నేపథ్యంలో బ్రహ్మండ సినిమా
హైదరాబాద్: తెలుగు సినిమా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రోజు మంత్రుల నివాస సముదాయంలో మమత ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై బన్నీ రాజు హీరోగా ఒగ్గు కళాకారుల జీవన నేపథ్యంలో నిర్మించిన “బ్రహ్మండ” సినిమా టీజర్ ను ఆయన రిలీజ్ చేశారు.
అనంతరం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, గ్రామీణ కళాకారుల జీవితాల నేపథ్యంలో అరుదుగా సినిమాలు వస్తుంటాయి.. తెలంగాణ సంస్కృతిక నేపథ్యం, జానపదాలపై సినిమాలు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటికి, ఇప్పటికి ఒగ్గుకళ గ్రామీణ ప్రజలను అలరిస్తుంది.
గ్రామీణ కళారూపాలు అంతరించిపోతున్నాయని ఆందోళన పడుతున్న ఈ సందర్భంలో ఒగ్గు కళాకారుల కథాంశంగా.. “బ్రహ్మండ” తీయడం గొప్ప విషయం.. ఈ సినిమా మంచి విజయం సాధించాలి, గ్రామీణ కళల్ని ఈ తరానికి తెలియజేయాలని మనస్పూర్తిగా ఆశిస్తూ.. “బ్రహ్మండ” సినిమా బ్రహ్మండగా ఆడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సినిమా నిర్మాత దాసరి సురేష్, దర్శకుడు రాంబాబు, హీరో బన్నీ రాజుతో పాటు ఇతర తారాగణం పాల్గొన్నారు.