Suryaa.co.in

Andhra Pradesh

సర్వేపల్లిలో ప్రత్యేక గ్రీవెన్స్ కు పోటెత్తిన ప్రజానీకం

– వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావిజ్ఞాపనల కార్యక్రమానికి 550కి పైగా అర్జీలు
– ప్రతి ఒక్కరినీ పలకరించి సమస్యలపై ఆరా తీస్తూ అర్జీలు స్వీకరించిన సోమిరెడ్డి, నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోష్ అనూష, మండల అధికారులు

సర్వేపల్లి: మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటగా వెంకటాచలంలో స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించాం. వందలాది మంది అర్జీలతో బారులుదీరారంటే…గత ప్రభుత్వం ప్రజల కోసం ఏ స్థాయిలో పనిచేశారో అర్థమవుతోంది.

పింఛన్లు, ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల మంజూరు, రీసర్వేలో తప్పిదాలు, భూఆక్రమణలు సంబంధించిన సమస్యలపైనే మెజార్టీ వినతులు వచ్చాయి.అంగన్వాడీ భవనాల నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారు. పాఠశాలల్లో వసతులదీ అదే పరిస్థితి. శ్మశానాలకు దారులు లేవు..ఉన్నవి ఆక్రమణకు గురయ్యాయి.

ప్రతి ఊరిలో సచివాలయాలు పెట్టి, ఉద్యోగులను నియమించినా ఇన్ని సమస్యలు పేరుకుపోవడం ఆశ్చర్యంగా ఉంది.రైతులు అవసరమైతే సర్వే చేయమని దరఖాస్తు చేస్తారు. కానీ ఎవరూ కోరని రీసర్వేను చేపట్టి రైతులను సమస్యల్లో ముంచడమెందుకో?

పక్కా ఇళ్ల అసంపూర్ణ నిర్మాణాలపైనా పలువురు అర్జీలు ఇచ్చారు. వైసీపీ పాలనలో హౌసింగ్ శాఖను భ్రష్టు పట్టించారు.2019కి ముందు కట్టిన ఇళ్లకు సంబంధించిన బిల్లులను కక్షపూరితంగా ఆపేశారు..దళితులు, గిరిజనులు అనే తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క కాలనీ నిర్మాణం పూర్తిగా జరగలేదు.

ఇప్పుడున్నది ప్రజల కోసం పనిచేస్తున్న మంచి ప్రభుత్వం..ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మాతో పాటు అధికారులపై ఉంది. నెల రోజుల్లో సాధ్యమైన సమస్యలన్నీ పరిష్కరించాలి.

LEAVE A RESPONSE