– రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న “కృష్ణవేణి సంగీత నీరాజన” కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్,కేంద్ర పర్యాటక శాఖ అధికారులు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంగీతం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేలా డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ లో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహించునున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయం మొదటి బ్లాక్ లోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో సీఎం చంద్రబాబు నాయుడుని కేంద్ర పర్యాటక శాఖ అధికారులు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, సంగీత్ నాటక అకాడమీ,ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న “కృష్ణవేణి సంగీత నీరాజన” కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర పర్యాటక శాఖ, సంగీత నాటక అకాడమీ అధికారులు ఆహ్వానించారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్రుల సాంస్కృతిక వైభవం, వారసత్వం, సంప్రదాయాలతో పాటు రాష్ట్ర లో ప్రఖ్యాతి పొందిన వంటకాలు, హస్త కళలు , చేనేత వస్త్రాలు, ప్రాచుర్యంలో లేని ప్రాంతాలకు ప్రచారం కల్పించనున్నారు. కర్ణాటక సంగీత ప్రదర్శనలతో పాటు పలు రకాల ప్రదర్శనలు ఉండనున్నాయి.
ఈ సందర్భంగా భేటీలో ప్రతి ఏటా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా నిర్వహిస్తోన్న కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమంపై చర్చతో పాటు రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఎకో, టెంపుల్, క్రూయిజ్, అడ్వెంచర్, రీజినల్, వెల్ నెస్ టూరిజం, సర్క్యూట్ ల ఏర్పాటుపై చర్చ జరిగింది. సావధానంగా విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అంశాలపై సానుకూలంగా స్పందించారు.