Suryaa.co.in

Andhra Pradesh

మైనారిటీ విద్యార్థులకు డిఎస్ సి -2024 కు ఉచిత కోచింగ్

– మైనారిటీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
– న్యాయ, మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

అమరావతి: రాష్ట్రంలోని మైనార్టీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ బద్ధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా అమలు చేస్తున్నదని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో డీ ఎస్ సి -2024 ను కూటమి ప్రభుత్వం నిర్వహించబోతున్నదని తెలిపారు. ఇందులో భాగంగా డీఎస్ సి కి హాజరయ్యే రాష్ట్రంలోని మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

మైనారిటీ విద్యార్థులైన ముస్లింలు, క్రైస్తవులు (బి సి -సి ), సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు తదితరులుకు ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్‌ను అందించడానికి అర్హులైన సంస్థలు మరియు అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించినట్లు మంత్రి తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలోని ప్రఖ్యాత ప్రైవేట్ సంస్థలతో ఎంప్యానెల్ చేయడం ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.

LEAVE A RESPONSE