Suryaa.co.in

Andhra Pradesh Political News

జగన్.. ఒక బెజ్జాల పూడ్చివేత కేసు!

– సీబీఐ కేసు అయ్యేదీ కాదు.. పొయ్యేదీ కాదు
(బో
యపాటి రమేష్)

జగన్ గారి కేసులు జాప్యం జరగడానికి కారణం చార్జి ఫైల్ సంక్లిష్టం కావడమా ? 70 మంది నిందితులు , 16 వేల పేజీల చార్జిషీటు ఓకె టన్ను సాక్ష్యాధారాలు చెప్పే దస్తావేజులు , కొన్ని వందల మంది సాక్షులు ….
ఇది ఒకరకంగా దొమ్మి కేసులా వుంది .

దొంగ ఒకేచోట దొంగతనం చేసినట్టుగా కాకుండా దొంగల ముఠా వూరిని దోపిడీ చేసినట్టు గా వుంది అందుకే ఈ విచారణలు డిశ్చార్జ్ పిటిషన్లు.. దానికి తగ్గట్టు.. మన న్యాయస్థానాల సూత్రం ఎందరు అవినీతిపరులు తప్పించుకున్నా ఒక నీతిపరుడికి శిక్ష పడకూడదు అనే న్యాయ సూత్రం. అందుకే A10 డిశ్చార్జి పిటిషన్ వేస్తాడు . అది విచారించి ఆ పిటిషన్ కొట్టి వేసే దానికి షుమారు 6 నెలలు.

కోర్టు రిజిస్ట్రార్ ను మేనేజ్ చేస్తే బెంచి మీదకు రాకుండా చేసే అవకాశం వుంది. మరో 6 నెలలు తర్వాత A9 … A8…..A7. ఇలా ఒక్కొక్కరు విడివిడిగా వేస్తారు 10×8:80 నెలలు అంటే షుమారు 7 నెలలు. ఆ తర్వాత హై కోర్టు… ఇక్కడా ఇదే తతంగం.

ఆ తర్వాత సుప్రీం కోర్టు … ఇక్కడా అదే తతంగం. ఈ లోగా జడ్జీలు పదవీ విరమణ. బహుశా 3,4 జడ్జీలు పదవీ విరమణ చేసి ఉంటారు . ఇలా కుండకు బెజ్జాలు వేయడానికి నిపుణులైన లాయర్లు ఉండనే వున్నారు. ఆ బెజ్జాల పూడ్చివేతకు ప్రభుత్వాలు ఎలా సహకరిస్తాయి అనేది రాజకీయ అవగాహన వుండే వారికి తెలుసు .

కోర్టులు చింపుతాం. చీరేస్తం అని అరిచినప్పుడు.. మన మీడియా ఓహ్ అంటూ పుంఖాను పుంఖాలుగా వార్తలు. కొద్ది రోజులకు ఈ మీడియా పేపర్లు వేరుసనక్కాయల పొట్లాటలకు. ఇలా భేతాళ కథ లాగా సాగుతూనే ఉంటుంది.

ఎన్డీఏ ప్రభుత్వం అయిన UPA ప్రభుత్వం అయిన అవినీతి అక్రమాల ఉద్యోగులు , లొసుగుల చట్టాలు వున్నంత కాల చేతినిండా డబ్బు వుంటే ఏమి కాదు. పేదవాడి ఆసుపత్రికి పోతే ఒక్కరోజులో రోగి చనిపోతే అదే కార్పొరేట్ హాస్పిటల్ వారు ఆక్సిజన్ , వెంటిలేటర్ ల మీద చాలా కాలం బతికిస్తారు . డబ్బు అయిపోతే నో డాక్టర్లకు విసుగు చిరాకు పుడితే అప్పుడు చచ్చినట్టు ప్రకటిస్తారు . కాబట్టి సీబీఐ కేసులు ఎప్పటికీ తెగవు అని అర్థం .

LEAVE A RESPONSE