– ఆసియాలోనే తొలిసారి
ఉబర్ సంస్థ సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. జమ్మూకశ్మీర్లోని దాల్ సరస్సు లో పడవ విహారానికి ‘ఉబర్ శికారా’ పేరిట ముందస్తు బుకింగ్ సేవలను ఉబర్ సంస్థ ప్రారంభించింది. జలరవాణాకు సంబంధించి ఉబర్ సంస్థ ఈమేరకు సేవలు అందుబాటులోకి తీసుకు రావడం ఆసియా లోనే ఇది మొదటిసారి.