– మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్వా సిరెడ్డి పద్మ
విజయవాడ: ముఖ్యమంత్రిని మార్చాలని సలహా ఇస్తున్న విజయసాయిరెడ్డి ముందు తన పార్టీని చక్కదిద్దుకోవడానికి జగన్ కు సలహా ఇవ్వాలని మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిసిన వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్ లో విజయసాయి చిల్లర రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని రాష్ట్ర ప్రజలు విజ్ఞత కలిగిన వారని ఓటమి తరువాత కూడా కూడా వైసీపీ బుద్ధి మారటం లేదని పద్మ విమర్శించారు.
ఇతర పార్టీలకు సలహాలు ఇచ్చేముందు ప్రజా నమ్మకం కోల్పోయిన జగన్ పార్టీ బాధ్యతల నుండి తప్పుకుని విజయమ్మకు పగ్గాలు అప్పచెప్పాలని విజయసాయిరెడ్డి జగన్ కు సలహా ఇస్తే బాగుంటుందని పద్మ అన్నారు. వైసీపీ నాయకుల పాపాల పుట్టలు బద్దలవటంతో దిక్కుతోచ డైవెర్షన్ కోసం కూటమి ప్రభుత్వంలో చిచ్చుపెట్టాలని విజయసాయి చీప్ ట్రిక్స్ తో మాట్లాడుతున్నాడు.
జగన్ ప్రభుత్వంలో ప్రతి స్కీము వెనుక పెద్ద స్కాం నడిపినట్లు ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై మాట్లాడే శక్తి లేని విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి పదవిని వివాదం చేయడానికి అత్యుత్సాహం చూపుతున్నాడు.