Suryaa.co.in

Editorial

రేషన్ ‘సిట్’లో మార్పులు?

  • వైసీపీ అధికారులంటూ విమర్శలు

  • వారిని సిట్‌లో ఎలా వేస్తారని ప్రశ్నల వర్షం

  • వేలెత్తి చూపిన టీడీపీ సోషల్‌మీడియా సైనికులు

  • దానితో దిద్దుబాటుకు దిగిన కూటమి సర్కారు

  • అధికారులను మార్చాలని నిర్ణయం?

  • రెండురోజుల్లో కొత్త ముఖాలతో సిట్?

  • ఫలించిన టీడీపీ సోషల్‌మీడియా సైనికుల ఆగ్రహం

  • ‘సూర్య’ ఎఫెక్ట్

( మార్తి సుబ్రహ్మణ్యం)

రేషన్‌బియ్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం నియమించిన సిట్‌లో నియమించిన సభ్యులపై విమర్శలు రావడంతో సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్ నాయకత్వంలో సిట్ నియమించింది. అయితే అందులో డీఎస్పీలుగా ఉన్న అధికారులు, గత ప్రభుత్వంలో వైసీపీ అధికారులుగా ముద్రపడ్డారంటూ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు విమర్శల వర్షం కురిపించారు.

ఈ నేపథ్యంలో వారి స్థానంలో కొత్త మరో రెండురోజుల్లో వారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినటు తెలుస్తోంది. అంతకంటే ముందు.. సిట్‌లో నియమితులైన అధికారులను జాయిన్ కావద్దని, ఫోన్‌లో ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. కాగా సిట్‌లో నియమించిన అధికారులకు సంబంధించి తెలుగుతమ్ముళ్ల ఆగ్రహజ్వాలను ‘రేషన్’సిట్‌లో వైసీపీ భక్త అధికారులు’ పేరిట ‘సూర్య’ లో ఈనెల 7న వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఇది కలకలం రేపింది. ఫవితంగా ప్రభుత్వం రంగంలోకి దిగి, దానిపై దృష్టి సారించి దిద్దుబాటుకు దిగడం విశేషం.

కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం కుంభకోణంపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ వేసింది. సమర్ధుడిగా పేరున్న వినీత్‌బ్రిజ్‌లాల్ నేతృత్వంలో డీఎస్పీ అశోక్‌వర్ధన్‌రెడ్డి, బాలసుందరరావు, గోవిందరావును నియమించడంపై టీడీపీ సోషల్‌మీడియా సైనికులు విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో వీరంతా వైసీపీకి వీరవిధేయులుగా పనిచేశారని, అందులో ఒంగోలు, దర్శి డీఎస్పీగా పనిచేసిన అశోక్‌వర్ధన్‌రెడ్డి టీడీపీ కార్యకర్తలపై రెచ్చిపోయారంటూ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు విమర్శల వర్షం కురిపించారు.

అలాంటి వారిని కీలకమైన సిట్‌లో నియమిస్తే, సరైన ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నలు సంధించారు. అసలు ఇలాంటి నియామకాలు ఏ స్థాయిలో నిర్ణయిస్తున్నారు? గత ప్రభుత్వంలో వీరవిధేయులుగా పనిచేసినవారెవరో కూడా తెలియని వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారా? వైసీపీ ప్రభత్వంలో అనుకూలంగా పనిచేసిన అధికారుల డేటా కూడా మీ దగ్గర లేదా? అది తెలిసిన అధికారులు లేరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

దానితో దిద్దుబాటుకు దిగిన కూటమి సర్కారు, డీఎస్పీలను విధుల్లో చే రవ ద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరో రెండురోజుల్లో, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో మిగిలిన ఇద్దరినీ మినహాయిస్తే, బాల సుందరరావు అప్పట్లో న్యూట్రల్‌గానే పనిచేశారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కాగా ఇలాంటి కీలకమైన సిట్‌లో వీఆర్‌లో ఉన్న వారికంటే.. ట్రాఫిక్, మహిళా పోలీసుస్టేషన్, ఎస్సీఎస్టీ సెల్‌లో పనిచేసే అధికారులను వినియోగించుకోవడం మంచిదని పలువురు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వారిపై పెద్దగా పనిఒత్తిళ్లు ఉండనందున, అలాంటి వారి సేవలు వాడుకోవడమే సరైందంటున్నారు.

ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న అధికారులలో, 80 శాతం మంది గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారన్న ముద్ర ఉంది. ఇలాంటి సిట్‌కు ఖాళీగా ఉన్న వారిని వాడుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తుంటారు. మిగిలిన వారిని తీసుకుంటే, వారికి రోజువారీ విధులుంటాయి కాబట్టి, వారి సేవలు వినియోగించుకోవడం కష్టమతుంది. అందుకే ఇలాంటి కేసుల్లో ఎక్కువగా, వీఆర్‌లో ఉన్న వారినే తీసుకుంటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అయితే సిట్ లాంటి కీలకమైన దర్యాప్తులకు ఎవరిని ఐజీలుగా నియమించాలని ప్రభుత్వమే నిర్ణయిస్తుంటుంది. త ర్వాత ఆ టీమ్‌లో ఎవరిని నియమించుకోవాలన్న స్వేచ్ఛను ఐజీకే ఇస్తుంది. ఐజీ గతంలో తన రేంజ్‌లో చురుకుగా పనిచేసిన అధికారులను సహజంగా ఆయా టీమ్‌లకు తీసుకుంటారు. ఇది ఎక్కడైనా జరిగేదే.

అయితే ఇప్పుడు బియ్యంపై వేసిన సిట్‌లో తీసుకున్న సభ్యులను మరి ఎవరు నియమించార న్న చర్చ పోలీసువర్గాల్లో జరుగుతోంది. విజిలెన్స్ డీజీ నియమించారా? లేక ఐజీ నియమించారా? అదీకాకపోతే గత ఆరునెలల నుంచి పోస్టింగులలో కీలకపాత్ర పోషిస్తున్న మాజీ డీజీపీ సిఫార్సు మేరకు నియమించారా? అన్నదే తేలాల్సి ఉందన్న చర్చ అటు పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

LEAVE A RESPONSE