Suryaa.co.in

Telangana

సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు

– ఆదిలాబాద్ జిల్లా బీ ఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి జోగు రామన్న ,ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఖానాపూర్ ఇంచార్జీ భూక్యా జాన్సన్ నాయక్

హైదరాబాద్ : మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే టీ రామారావు ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలం కలిశాo. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్న ఉదంతాలను కేటీఆర్ దృష్టికి తెచ్చా౦. అసెంబ్లీ సమావేశాల్లో ఆదిలాబాద్ కు సంబంధించిన పెండింగ్ అంశాలు లేవనెత్తాలని కోరాం.

సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎన్నికల సమయం లో రేవంత్ రెడ్డి వారి సమస్యలను చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏడాది పాలన పూర్తయినా, సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకున్నా పాపాన పోలేదు. ఆశా వర్కర్లు తమ డిమాండ్ల పై రోడ్డెక్కితే పోలీసులతో కొట్టించారు.

సర్వ శిక్షా అభియాన్ ,ఆశా వర్కర్ల సమస్యలను బీఆర్ఎస్ పక్షాన ఆసెంబ్లీలో లేవనెత్తుతామని కేటీఆర్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో మూసేసిన సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామనీ ,ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ వేయిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది. బూటకపు హామీలెన్నో ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు దిశగా చేస్తున్న ప్రయత్నాలు శూన్యం. కాంగ్రెస్ హామీల వైఫల్యం పై అసెంబ్లీలో నిలదీయాలని కేటీఆర్ ను కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో సీనియర్ నాయకులు పార్టీ ని విడిచివెళ్లినప్పటికీ బీఆర్ఎస్ బలం చెక్కు చెదరలేదు. ఆదిలాబాద్ కార్యకర్తల సమావేశం నిర్వహించినట్టుగానే నిర్మల్ ,ఆసిఫాబాద్ ,మంచిర్యాల జిల్లా కార్యకర్తల మీటింగ్ లు త్వరలోనే నిర్వహిస్తాం ..ఆ సమావేశాలకు హాజరు కావాలని కేటీఆర్ ను ఆహ్వానించాం. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే జిల్లాల వారీగా కార్యకర్తల మీటింగ్ లకు తాను హాజరవుతానని హామీ ఇచ్చిన కేటీఆర్ కి కృతజ్ఞతలు.

LEAVE A RESPONSE