– పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి
– హాలీవుడ్,బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు
– ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్ డిసి చైర్మన్ గా నియమించాం
ఐటీ, ఫార్మా తో పాటుగా మాకు సినిమా పరిశ్రమ కూడా అంతే ముఖ్యం.
– సినిమా పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం. ఐటీ, ఫార్మా తో మాకు సినిమా పరిశ్రమ కూడా ముఖ్యం. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం.
ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించాం. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చు. తెలంగాణ లోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి.
ముంబైలో వాతావరణం కారణం గా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ. హాలీవుడ్,బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతాం. హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నాం. పరిశ్రమను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం. గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి.
సినిమా పరిశ్రమ కు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి.ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడం మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత నాది. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం. మా ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. సినిమాలకు మా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇచ్చింది.
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాం. ఐటీ, ఫార్మా తో పాటుగా మాకు సినిమా పరిశ్రమ కూడా అంతే ముఖ్యం. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం. సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం.
మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది.సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి