చెన్నై : డ్రైవర్ రహిత మెట్రోరైలు ట్రయల్ రన్ ప్రారంభమైంది. త్వరలో ఈ మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ రెండో విడత ప్రాజెక్ట్ డైవర్ రహిత మెట్రో రైళ్లు నడపాలని నిర్ణయించింది.ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ డ్రైవర్ రహిత మెట్రోరైలు ట్రయన్ రన్ ప్రారంభించామన్నారు. గంటకు 10కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో తొలివిడత ట్రయల్ రన్ జరుగుతుందని తెలిపారు.