జగన్ జమానాకు తలవంచని వీరుడిగా.. పోస్టింగ్ కోసం పాలకులను దేబిరించకుండా, నిటారుగా నిలబడి, కలబడి, రిటైర్మెంట్ చివరిరోజు వరకూ జగన్ సర్కారుతో పోరాడిన యోద్ధ.. కనీసం ఒక్కసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖం చూడని ఏకైక ఐపిఎస్ అధికారిగా చరిత్ర సృష్టించిన, మాజీ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ బెటాలియన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళం.. ఆయన బ్యాచ్‌మేట్స్, ఆయన దగ్గర పనిచేసిన అధికారులు, మిత్రులు, శ్రేయోభిలాషుల నడుమ ఆహ్లాదకరం.. ఉల్లాసం.. ఉత్సాహంగా జరిగింది.
ప్రస్తుతం వివిధ హోదాలో పనిచేస్తున్న ఐపిఎస్, ఐఏఎస్ అధికారులు, ఏబీ వెంకటేశ్వరరావుతో కలసి పనిచేసిన ఆయన సహచరులు, జర్నలిస్టులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరయి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీతో పనిచేసిన అనుభవాలను కొందరు అధికారులు, ఆత్మీయ సమ్మేళంలో పాల్గొన్నారు.
అటు ఏబీ కూడా.. తన సర్వీసు ప్రారంభమైన పోలీసుస్టేషన్లో పనిచేసిన నాటి నుంచి .. డీజీ వరకూ తనకు ఎదురైన అనుభవాలను మిత్రులతో పంచుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఏబీని అభినందలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఏబీ జీవితంలో జరిగిన సంఘటనలకు సంబంధించి రూపొందించిన డాక్యుమెంటరీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.