– ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన వాసంశెట్టి సత్యం
రామచంద్రపురం: విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. బుధవారం రామచంద్రపురం శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జాతీయ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జాతీయ ఉన్నత పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో రామచంద్రపురం పాన్ షాప్ అసోసియేషన్, వేమగిరి కోకోకోలా బాటిల్ యూనిట్ కంపెనీ సౌజన్యంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వాసంశెట్టి సత్యం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసి, వారిని మరింత ప్రోత్సహించారు. ఈ సంక్రాంతి ప్రజలందరికీ జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుర్రకథ కళాకారులు, పూర్వ విద్యార్థి గొర్రెల శ్రీనివాస్ హరిదాసు వేషధారణతో అలరించగా యువత సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.
అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పూర్వ విద్యార్థి సిరిగినేడి ప్రసాద్ సౌజన్యంతో బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గంగరాజు, ప్రధానోపాధ్యాయులు వీర రాఘవరెడ్డి, పిడి జంపని రఘురాం, పాన్ షాప్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పడాల సూరిబాబు, సిరిగినేడి దుర్గాప్రసాద్ లు పాల్గొన్నారు.
ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా అధ్యాపకులు లావణ్య, అనుపమ, గణేశ్వరి, రోషిని తదితరులు వ్యవహరించారు. అలాగే ఈ బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో కంచుమర్తి బాబురావు, విశ్రాంత ఉపాధ్యాయులు సలాది వెంకప్ప నాయుడు, పిడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.