– ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆదేశాల మేరకు ముందుకు కదిలిన ఏపీటీడీసీ యంత్రాంగం
కొండపల్లి: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమ ప్రాంతంతో పాటు, కొండపల్లి జర్నలిస్టు కాలనీ సమీపంలో ఉన్న ఏపీ టూరిజం స్థలాన్ని గత శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. చైర్మన్ సందర్శన సమయంలో, ముళ్ల పొదలతో నిండి ఉన్న ప్రాంతాన్ని గమనించి, వెంటనే శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. దీనిపై స్పందించిన యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టి, చెత్త చెదారం మరియు ముళ్ల కొంపలను తొలగించి, ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చారు.
ఈ ప్రాంతంలో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని చైర్మన్ సూచించారు. పర్యాటకుల సౌకర్యార్థం బెంచీలు, పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు మరియు తాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే, ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు లాండ్‌స్కేపింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, టూరిజం శాఖ సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. త్వరలోనే ఈ ప్రాంతం పర్యాటకులకు ఆకర్షణీయ కేంద్రంగా మారనుందని చైర్మన్ తెలిపారు.
కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.