– కల్వకుర్తి పంపులు ఆన్ చేసినట్టే కాళేశ్వరం పంపులు ఆన్ చేయండి
– రంకెలు వేస్తున్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే
– పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు పెట్టండి ..ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ఎక్కడైనా ప్రతిపక్షం సలహాలు తీసుకుని ప్రభుత్వం పని చేస్తుంది. ఇక్కడ మాత్రం ప్రతిపక్షం సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అధికారులను అడగరు అవగాహన పెంచుకోరు. కల్వకుర్తి లిఫ్ట్ లను ఆన్ చేయాలని ఎప్పట్నించో అడిగితే ఈ రోజు ఆన్ చేశారు.
ఈ నెలాఖరుకు లిఫ్ట్ లు ఆన్ చేస్తామన్న ఉత్తమ్ ఈ రోజే ఎందుకు ఆన్ చేశారు? జూరాల లిఫ్ట్ లు కూడా ఆన్ చేయాల్సిన టైం లో ఆన్ చేయలేదు. తప్పులు సరిచేసుకొమ్మని మేము ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపుతున్నాం. కల్వకుర్తి పంపులు ఆన్ చేసినట్టే కాళేశ్వరం పంపులు ఆన్ చేయండి. కాళేశ్వరం బంద్ పెడితే కేసీఆర్ బద్నామ్ కారు .బద్నామ్ అయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వమే. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపండి.
చర్చ కు పిలిచింది రేవంత్ రెడ్డే. కే టీ ఆర్ చర్చకు వస్తే రేవంత్ పారిపోయాడు. కే టీ ఆర్ చర్చకు అంగీకరిస్తే తాను కార్యకర్తలతో వస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లో చర్చిస్తానంటే రేవంత్ కార్యకర్తలతో వస్తానని అనే వారు కాదు. పార్లమెంట్ లో చర్చిస్తే రేవంత్ రెడ్డి ఎలా వెళతారు?
అసెంబ్లీ లో బీ ఆర్ ఎస్ కు మైక్ కట్ చేయకుండా ఉంటే చర్చకు సిద్ధమని కే టీ ఆర్ ఇప్పటికే చెప్పారు. అసెంబ్లీ లో బీ ఆర్ ఎస్ కు సరైన టైం ఇప్పించాల్సిన భాద్యత మహేష్ కుమార్ గౌడ్ దే. మహేష్ కుమార్ కే టీ ఆర్ పై అనవసర విమర్శలు చేయొద్దు. ఏయే రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఎంత ఖర్చు చేశారో అసెంబ్లీ లో చర్చకు పెట్టండి.
నీళ్ల కోసం ,కరెంటు కోసం కూడా ప్రతి రోజూ ప్రభుత్వం తో కొట్లాడే పరిస్థితి తెచ్చారు విలువైన సమయాన్ని తిట్ల తో వృధా చేయకుండా కాంగ్రెస్ నేతలు ప్రజలకు మేలు చేసే మాటలు మాట్లాడాలి. గట్టి ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వానికే మేలు అని గ్రహించాలి. రంకెలు వేస్తున్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే మేము కాదు. పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు పెట్టండి .ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది.
స్థానిక ఎన్నికలల్లో కాంగ్రెస్ గెలిచే సత్తా ఉంటె ఎన్నికలు తొందరగా పెట్టాలి. బీసీ రిజర్వేషన్ల పై ఏ ఆందోళనలు చేయాలో పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది. ప్రెస్ మీట్ లో శుభ ప్రద్ పటేల్ ,బాలరాజు యాదవ్ పాల్గొన్నారు.